Site icon NTV Telugu

185Hz OLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా సెటప్, 10,000mAh బ్యాటరీతో HONOR WIN, WIN RT స్మార్ట్‌ఫోన్లు లాంచ్.. స్పెక్స్, ధర వివరాలు ఇవే..!

Honor Win

Honor Win

HONOR WIN, WIN RT: హానర్ (HONOR) కొత్తగా గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్‌ఫోన్లు హానర్ విన్ (HONOR WIN), హానర్ విన్ RT (HONOR WIN RT) లను చైనాలో అధికారికంగా లాంచ్ చేసింది. ఈ రెండు ఫోన్లలో 6.83 అంగుళాల 1.5K (1272×2800 పిక్సెల్స్) OLED డిస్‌ప్లే, 185Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్, 6000 నిట్స్ HDR పీక్ బ్రైట్‌నెస్, 5920Hz హై-ఫ్రీక్వెన్సీ PWM డిమ్మింగ్ (Zero-risk dimming) ఉన్నాయి. అలాగే, 3500Hz ఇన్‌స్టంట్ టచ్ కంట్రోల్ వల్ల గేమింగ్‌లో ఎయిమింగ్, మూవ్‌మెంట్, కాంబోలు చాలా తక్కువ లేటెన్సీతో స్మూత్‌గా జరుగుతాయని హానర్ తెలిపింది.

ఇక ప్రాసెసర్ అండ్ పనితీరు విషయానికి వస్తే.. హానర్ విన్ RT లో Snapdragon 8 Elite (4nm), గరిష్టంగా 4.32GHz క్లాక్ స్పీడ్ కలిగి ఉండగా.. హానర్ విన్ లో Snapdragon 8 Gen 5 (3nm) మొబైల్ ప్లాట్ ఫారం కలిగిఉంది. ఈ ఫోన్లు 12GB / 16GB LPDDR5X అల్ట్రా ర్యామ్, 256GB / 512GB / 1TB UFS 4.1 స్టోరేజ్ ఆప్షన్లతో వస్తాయి. ఈ హానర్ విన్ సిరీస్‌లో Dongfeng టర్బో కూలింగ్ సిస్టంను అందించింది. ఇందులో ఇండస్ట్రీలో తొలిసారిగా డైరెక్ట్-డ్రైవ్ కూలింగ్ ఎయిర్ ఫ్లో, డ్యూయల్ 360° సరౌండ్ ఫ్యాన్స్, 25,000 RPM “Rage Mode”, మంచి ఫ్యాన్ స్పీడ్ ఉన్నాయి. దీని వల్ల ఫోన్ ఉష్ణోగ్రత భారీగా తగ్గి, ఎక్కువ గేమింగ్ సెషన్లలోనూ స్టేబుల్ పనితీరు లభిస్తుందని కంపెనీ పేర్కొంది.

Gmail Address: గూగుల్ కొత్త ఫీచర్ విడుదల.. Gmail అడ్రస్ ఎలా మార్చుకోవాలంటే..?

ఇక కెమెరా ఫీచర్లు చూస్తే వీటిలో 50MP మెయిన్ కెమెరా (OIS), 12MP అల్ట్రా వైడ్ కెమెరా, 50MP ఫ్రంట్ కెమెరా (4K వీడియో సపోర్ట్) ఉండగా, హానర్ విన్ మోడల్‌లో అదనంగా 50MP 3x టెలిఫోటో కెమెరా (OIS, 50x డిజిటల్ జూమ్) లభిస్తుంది. బ్యాక్ ప్యానెల్‌లో అల్ట్రా-లైట్, అల్ట్రా-థిన్ ఫైబర్‌గ్లాస్ డిజైన్, 85% ఆర్క్ రేషియోతో కర్వ్ ఫ్రేమ్ డిజైన్ ఉంది. ఈ ఫోన్లలో 10,000mAh థర్డ్-జెనరేషన్ కార్బన్-సిలికాన్ బ్యాటరీ ఉంది. ఇప్పటివరకు స్మార్ట్‌ఫోన్‌ ప్రపంచంలో ఉన్న అతిపెద్ద బ్యాటరీలలో ఒకటి. ఇక వీటికి హానర్ విన్ కు 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, హానర్ విన్ RT కి 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. అలాగే గరిష్టంగా 27W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది.

ఇతర ముఖ్య ఫీచర్ల విషయానికి వస్తే.. IP68 + IP69 + IP69K డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్ కలిగి ఉంది. ఇంకా మెటల్ ఫ్రేమ్, 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, హానర్ AI సరౌండ్ సబ్‌వూఫర్, మేజిక్ UI 10.0 (Android 16 ఆధారితం), Wi-Fi 7, Bluetooth 6.0, NFC, USB Type-C కలిగి ఉన్నాయి.

చైనాలో HONOR WIN RT స్మార్ట్‌ఫోన్‌ను 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌ను 2699 యువాన్‌కి (రూ.34,465) అందిస్తున్నారు. అలాగే 16GB RAM + 256GB స్టోరేజ్ మోడల్ ధర 2999 యువాన్ కాగా, 12GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్‌కు 3099 యువాన్‌గా నిర్ణయించారు. ఇక 16GB RAM + 512GB స్టోరేజ్ మోడల్ ధర 3399 యువాన్ కాగా, టాప్ వేరియంట్ అయిన 16GB RAM + 1TB స్టోరేజ్ మోడల్‌ను 3999 యువాన్‌కు విక్రయిస్తున్నారు.

Pemmasani Chandra Sekhar: కార్పొరేట్ బ్యాంకుల పని తీరు సరిగ్గా లేదు..

Image (1)

అదే విధంగా HONOR WIN స్మార్ట్‌ఫోన్ ధరలు మరింత ప్రీమియం స్థాయిలో ఉన్నాయి. 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌ను 3999 యువాన్‌కు అందిస్తుండగా, 12GB RAM + 512GB స్టోరేజ్ మోడల్ ధర 4499 యువాన్. ఇక 16GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్‌కు 4799 యువాన్ ధరగా నిర్ణయించారు. టాప్ వేరియంట్ అయిన 16GB RAM + 1TB స్టోరేజ్ మోడల్‌ను 5299 యువాన్స్ కు విక్రయిస్తున్నారు. ఈ రెండు ఫోన్లు ఇప్పటికే చైనా మార్కెట్‌లో అమ్మకాలకు అందుబాటులో ఉన్నాయి. లాంచ్ ఆఫర్‌లో భాగంగా కొన్ని ఎంపిక చేసిన వేరియంట్లపై 100 యువాన్ వరకు డిస్కౌంట్ కూడా అందిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.

Exit mobile version