Honor Turbo 5G: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో Honor మరో కొత్త మిడ్-రేంజ్ 5G ఫోన్‌ను విడుదల చేసింది. Honor Turbo 5G పేరుతో వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ భారీ 8,560mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, Qualcomm Snapdragon ప్రాసెసర్ వంటి ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ ఫోన్ యూరేషియా ప్రాంతంలో విడుదలైంది. ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో కూడా త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
6.79 అంగుళాల AMOLED డిస్‌ప్లే
Honor Turbo 5Gలో 6.79 అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది Full HD+ రిజల్యూషన్‌తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్ కు సపోర్ట్ చేస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ కారణంగా స్క్రోలింగ్, యానిమేషన్లు, యాప్‌ల మధ్య మారడం మరింత స్మూత్‌గా ఉంటుంది. వీడియోలు చూడటం, సోషల్ మీడియా బ్రౌజింగ్ వంటి రోజువారీ పనులకు ఈ డిస్‌ప్లే ఉపయోగకరంగా ఉంటుంది.
Snapdragon 6 Gen 4 ప్రాసెసర్
పనితీరు కోసం ఈ స్మార్ట్‌ఫోన్‌లో Qualcomm Snapdragon 6 Gen 4 చిప్‌సెట్ ను ఉపయోగించారు. Geekbench 6లో ఈ ఫోన్ సుమారు 1,070 సింగిల్-కోర్, 3,060 మల్టీ-కోర్ స్కోర్ సాధించినట్లు సమాచారం. రోజువారీ స్మార్ట్‌ఫోన్ వినియోగం, సోషల్ మీడియా, వీడియో స్ట్రీమింగ్, మల్టీటాస్కింగ్‌తో పాటు సాధారణ గేమింగ్‌కు ఈ ప్రాసెసర్ సరిపడే పనితీరును అందించే అవకాశం ఉంది. ఫోన్‌లో 8GB RAM, 256GB స్టోరేజ్ అందించారు.
50MP డ్యూయల్ కెమెరా సెటప్
ఫోటోగ్రఫీ కోసం Honor Turbo 5G వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 5MP అల్ట్రావైడ్ కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరా సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 16MP కెమెరా అందించారు.
8,560mAh భారీ బ్యాటరీ
Honor Turbo 5Gలో ప్రధాన ఆకర్షణ 8,560mAh బ్యాటరీ. సాధారణ స్మార్ట్‌ఫోన్లతో పోలిస్తే ఇది చాలా పెద్ద బ్యాటరీ సామర్థ్యం. దీంతో ఎక్కువసేపు ఫోన్‌ను ఛార్జింగ్ అవసరం లేకుండా ఉపయోగించుకోవచ్చని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ ఫోన్ బరువు సుమారు 196 గ్రాములు మాత్రమేనని సమాచారం. అంతేకాకుండా 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ కు కూడా ఫోన్ సపోర్ట్ చేస్తుంది.
IP69 రేటింగ్
మన్నిక విషయంలో కూడా Honor Turbo 5G ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ ఫోన్‌కు IP69 రేటింగ్ ఉంది. దీంతో దుమ్ము, నీటి నుంచి మెరుగైన రక్షణ లభిస్తుంది. రోజువారీ వినియోగంలో వివిధ పరిస్థితులను తట్టుకునేలా ఫోన్‌ను రూపొందించినట్లు కంపెనీ పేర్కొంది.
Android 16, MagicOS 10
సాఫ్ట్‌వేర్ పరంగా Honor Turbo 5G Android 16 ఆధారిత MagicOS 10పై పనిచేస్తుంది. దీంతో కొత్త Android ఫీచర్లు, Honor అందించే సాఫ్ట్‌వేర్ ఫీచర్లు ఇందులో లభించే అవకాశం ఉంది.
Honor Turbo 5G ధర
ధర విషయానికి వస్తే, 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.33,990 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఫోన్ నలుపు, ఆకుపచ్చ, నారింజ రంగుల్లో అందుబాటులోకి వచ్చింది.

