HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్‌షిప్.!

HONOR Magic V6 Launched: ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సత్తా చాటేందుకు హానర్ (HONOR) నుండి కొత్త ఫ్లాగ్‌షిప్ డివైస్ హానర్ మ్యాజిక్ V6 (HONOR Magic V6) ను గ్లోబల్ మార్కెట్లో లాంచ్ చేసింది. స్లిమ్ డిజైన్, భారీ బ్యాటరీ, ప్రీమియం కెమెరా ఫీచర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు, అలాగే ఆపిల్ ఎకోసిస్టమ్‌తో కూడా పనిచేసే ప్రత్యేక సామర్థ్యాలతో ఈ ఫోన్ వచ్చేసింది.

సూపర్ స్లిమ్ డిజైన్:
HONOR Magic V6 ప్రధాన ఆకర్షణగా అతి సన్నని డిజైన్. ఫోన్ మడిచినప్పుడు కేవలం 8.75mm మందం మాత్రమే ఉండగా, విప్పినప్పుడు వైట్ వేరియంట్‌లో 4.0mm మందంతో వస్తుంది. బరువు కూడా సుమారు 219 గ్రాములే కావడం విశేషం. సాధారణ స్మార్ట్‌ఫోన్‌ను చేతిలో పట్టుకున్న అనుభూతిని అందించేలా ఈ డిజైన్‌ను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ఈ ఫోల్డబుల్‌లో HONOR సూపర్ స్టీల్ హింగే ను ఉపయోగించారు. ఇది 2800 MPa టెన్సైల్ స్ట్రెంగ్త్‌తో అత్యంత బలమైన హింజ్‌లలో ఒకటిగా పేర్కొంటున్నారు. ఫోన్ పడిపోయినప్పుడు దెబ్బలను తట్టుకునేందుకు AI ఆధారిత బియోనిక్ కుషనింగ్ సిస్టమ్‌ను కూడా ఇందులో అందించారు. ఇన్నర్ డిస్‌ప్లేకు UTG ఫ్లెక్సిబుల్ గ్లాస్ రక్షణ ఉండగా, ఔటర్ డిస్‌ప్లేకు “యాంటీ-స్క్రాచ్ నానో క్రిస్టల్ షీల్డ్” ను అందించారు. అలాగే IP68, IP69 రేటింగ్‌లతో నీరు, దుమ్ము, హై ప్రెజర్ వాటర్ స్ప్రేల నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది.

డ్యూయల్ AMOLED డిస్‌ప్లేలు:
ఈ కొత్త ఫోల్డబుల్ మొబైల్ లో రెండు అధునాతన డిస్‌ప్లేలు ఉన్నాయి. బయట భాగంలో 6.52 అంగుళాల డిస్‌ప్లే ఉండగా.. 6000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కలిగి ఉంది. లోపల 7.95 అంగుళాల పెద్ద ఫోల్డబుల్ స్క్రీన్‌ 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంది. ఇవి 1Hz నుంచి 120Hz వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 4320Hz PWM డిమ్మింగ్, కేవలం 1.5% రిఫ్లెక్టివిటీ వంటి ఫీచర్ల వల్ల ఎండలోనూ స్పష్టమైన విజిబిలిటీతో పాటు కళ్లపై ఒత్తిడి కూడా తగ్గుతుంది.

అతిపెద్ద బ్యాటరీ:
ఈ ఫోన్‌లో 6660mAh హానర్ సిలికాన్-కార్బన్ బ్యాటరీని అమర్చారు. ప్రస్తుతం ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లలో ఇదే అతిపెద్ద బ్యాటరీగా కంపెనీ పేర్కొంటోంది. 25 శాతం సిలికాన్ కంటెంట్‌తో 921Wh/L ఎనర్జీ డెన్సిటీని అందిస్తూ ఎక్కువ బ్యాటరీ సామర్థ్యాన్ని తక్కువ స్థలంలో అందిస్తోంది. చార్జింగ్ పరంగా కూడా ఈ ఫోన్ బాగానే ఉంది. 80W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 66W వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్, వైర్‌లెస్ రివర్స్ చార్జింగ్ లు ఉన్నాయి.

ట్రిపుల్ కెమెరా సెటప్:
ఫోటోగ్రఫీ కోసం హానర్ AI ఫల్కన్ కెమెరా సిస్టంను అందించారు. ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50MP మెయిన్ కెమెరా, 64MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, 50MP అల్ట్రా వైడ్ కెమెరాలు ఉన్నాయి. ఫోటోలు, వీడియోలను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు AI Color Engine, Magic Color 2.0, Magic Video Color, AI Image to Video 2.0 వంటి AI ఫీచర్లు ఉన్నాయి.
ధరలు:
HONOR Magic V6 రెడ్, గోల్డ్, వైట్, బ్లాక్ రంగుల్లో అందుబాటులోకి వచ్చింది. ఈ మలేషియాలో 16GB + 512GB వేరియంట్ RM 7,699 (రూ. 1.84 లక్షలు), 16GB + 1TB వేరియంట్ RM 8,899 (రూ. 2.13 లక్షలు) కాగా, సింగపూర్ లో 16GB + 512GB వేరియంట్ SGD 2,599 (రూ. 1.94 లక్షలు), 16GB + 1TB వేరియంట్ SGD 2,899 (రూ. 2.16 లక్షలు) గా నిర్ణయించారు. ప్రస్తుతం మలేషియా, సింగపూర్ మార్కెట్లలో అందుబాటులోకి వచ్చిన ఈ ఫోల్డబుల్ ఫ్లాగ్‌షిప్ త్వరలో యూరప్, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా (MEA), ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో కూడా విడుదల కానుంది.