ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్‌లతో HONOR Magic 9 లాంచ్.!

  • చైనాలో హానర్ మ్యాజిక్ 9 స్మార్ట్‌ఫోన్‌ లాంచ్
  • ARRI కో-బ్రాండెడ్ డ్యూయల్ 200MP కెమెరా సెటప్
  • 200MP మెయిన్, 200MP టెలిఫోటో, 50MP అల్ట్రా-వైడ్ కెమెరాలు
  • 55MP సెల్ఫీ కెమెరా అందించిన హానర్
  • 6.37 అంగుళాల OLED డిస్‌ప్లే, 10,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్
  • స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్
  • 8,000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ
  • 80W వైర్డ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్
  • ARRI LogC3, 87 ARRI లుక్ ప్రొఫైల్స్‌కు సపోర్ట్
  • IP68, IP69, IP69K వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్స్..
Honor Magic 9

Honor Magic 9

HONOR Magic 9: హానర్ సంస్థ చైనాలో తన కొత్త మ్యాజిక్ 9 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. ఈ సిరీస్‌లో హానర్ మ్యాజిక్ 9, మ్యాజిక్ 9 ప్రో మాక్స్, మ్యాజిక్ 9 సూపర్ ఎడిషన్ అనే మూడు మోడల్స్ ఉన్నాయి. ఇందులో మ్యాజిక్ 9, మ్యాజిక్ 9 ప్రో మాక్స్ మోడల్స్‌లో ARRIతో కలిసి అభివృద్ధి చేసిన కెమెరా సిస్టమ్‌ను అందించారు. ముఖ్యంగా ప్రో మాక్స్ మోడల్‌లో 200MP మెయిన్ కెమెరాతో పాటు 200MP టెలిఫోటో కెమెరాను ఇచ్చారు.

డ్యూయల్ 200MP కెమెరాలు

హానర్ మ్యాజిక్ 9లో ARRI కో-బ్రాండెడ్ డ్యూయల్ 200MP కెమెరా సెటప్ ఉంది. ఇందులో 1/1.4-అంగుళాల సెన్సార్‌తో 200MP మెయిన్ కెమెరా, f/1.9 అపెర్చర్, CIPA 7.5 స్టెబిలైజేషన్‌తో వస్తుంది. ఇంకో 200MP టెలిఫోటో కెమెరాకు 1/1.56 అంగుళాల సెన్సార్, f/2.6 అపెర్చర్, CIPA 7.5 స్టెబిలైజేషన్ ఉన్నాయి. వీటికి 50MP అల్ట్రా-వైడ్ కెమెరా జతగా ఉంది. ముందువైపు 55MP సెల్ఫీ కెమెరాను అందించారు. ఇది 1/2.74-అంగుళాల సెన్సార్, f/2.0 అపెర్చర్‌తో పాటు 1:1 స్క్వేర్ ఫుల్-ఫ్రేమ్‌ను సపోర్ట్ చేస్తుంది.

ARRI టెక్నాలజీ

మ్యాజిక్ 9లో 6nm హానర్ Yuguang H1 ఇమేజింగ్ చిప్‌ను ఉపయోగించారు. ఇది 18.8 TOPS/W సామర్థ్యంతో పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. RAW డొమైన్‌లో లాస్‌లెస్ నాయిస్ రిడక్షన్‌కు ఈ చిప్ సహకరిస్తుంది. ARRI LogC3 పైప్‌లైన్ ద్వారా 87 అధికారిక ARRI లుక్ ప్రొఫైల్స్‌కు సపోర్ట్ లభిస్తుంది. ARRI LUT ఎకోసిస్టమ్‌లోని ఎన్విరాన్మెంట్-5220, కాంట్రాస్ట్-7120 వంటి ప్రొఫైల్స్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు. ARRI లైవ్ ఫోటో ఫీచర్ ద్వారా మూడు సెకన్ల 4K క్లిప్‌లను 2.39:1 సినిమాటిక్ యాస్పెక్ట్ రేషియోలో రికార్డ్ చేయవచ్చు.

200MP జూమ్-ఫ్లాష్ పోర్ట్రెయిట్, వేరియబుల్-ఫోకస్ ఫ్లాష్, AI కలర్ మ్యాచింగ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. అదనంగా G200 టెలిఫోటో ఎక్స్‌టెండర్‌ను అందిస్తున్నారు. దీని బరువు 88 గ్రాములు, పొడవు 81mmగా ఉంది.

OLED డిస్‌ప్లే

హానర్ మ్యాజిక్ 9లో 6.37 అంగుళాల OLED డిస్‌ప్లే ఉంది. ఇది 1236 × 2664 పిక్సెల్స్ రిజల్యూషన్, 460ppi, DCI-P3 కలర్ గామట్, 1.07 బిలియన్ కలర్స్‌తో వస్తుంది. స్క్రీన్-టు-బాడీ రేషియో 95.6 శాతంగా ఉంది. 60Hz, 90Hz, 120Hz రిఫ్రెష్ రేట్‌లకు సపోర్ట్‌తో పాటు 3840Hz PWM డిమ్మింగ్, డాల్బీ విజన్, HDR వివిడ్, ZREAL వంటి ఫీచర్లు ఉన్నాయి. డిస్‌ప్లే గరిష్ఠంగా 10,000 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది.

Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్

మొబైల్ పనితీరు కోసం హానర్ మ్యాజిక్ 9లో స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌ను అందించారు. దీంతో గేమింగ్, మల్టీటాస్కింగ్, కెమెరా ప్రాసెసింగ్ వంటి పనుల్లో మంచి పనితీరు అందించేందుకు ఫోన్‌ను రూపొందించారు.

8,000mAh భారీ బ్యాటరీ

హానర్ మ్యాజిక్ 9లో 8,000mAh Qinghai లేక్ సిలికాన్-కార్బన్ బ్యాటరీ ఉంది. ఇందులో 25% సిలికాన్ కంటెంట్ ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. ఛార్జింగ్ విషయానికి వస్తే 80W వైర్డ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఉంది. 300కు పైగా కార్ మోడళ్లలో 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు ఈ ఫోన్ అనుకూలంగా ఉంటుందని హానర్ తెలిపింది. ఇక ఇందులో మూడో తరం C3 RF చిప్, 7-చిప్ RF ఆర్కిటెక్చర్, హానర్ హొంగ్యాన్ AI క్లౌడ్ మ్యాప్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇక దీనికి IP68, IP69, IP69K రేటింగ్స్‌ను అందించారు.