Site icon NTV Telugu

200MP కెమెరా, 7,200mAh బ్యాటరీతో పాటు Honor Magic 8 RSR Porsche Design స్పెసిఫికేషన్లు అదుర్స్

Honor

Honor

Honor Magic 8 RSR Porsche Design: హానర్ సంస్థ తన ప్రీమియం ఫ్లాగ్‌షిప్ సిరీస్‌లో భాగంగా Honor Magic 8 RSR Porsche Design స్మార్ట్‌ఫోన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తుంది. అధికారిక ప్రకటనకు ముందే ఈ ఫోన్‌కు సంబంధించిన ప్రమోషనల్ చిత్రాలు, లాంచ్ డేట్, కీలక స్పెసిఫికేషన్లు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం అయ్యాయి. ఈ మోడల్ 2024లో విడుదలైన Honor Magic 7 RSR Porsche Designకు ఫాలో అప్ గా రానుందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, Honor Magic 8 RSR Porsche Design జనవరి 19వ తేదీన లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇదే రోజున Honor Magic 8 Pro Air మోడల్‌ను కూడా హానర్ సంస్థ రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ధృవీకరించింది.

Read Also: Niharika-Rakasa : నిహారిక కొణిదెల నిర్మాణంలో ‘రాకాస’.. రిలీజ్ డేట్ ఫిక్స్!

డిజైన్ & లుక్
ఈ ఫోన్ పర్పుల్ కలర్ వేరియంట్‌లో కనిపిస్తోంది. వెనుక భాగంలో మధ్యలో ఉండే స్క్విర్కిల్ డిజైన్ కెమెరా మాడ్యూల్ ఆకర్షణగా నిలుస్తోంది. ఈ డిజైన్, గత మోడల్ Honor Magic 7 RSR Porsche Designను పోలి ఉండడం గమనార్హం. ఈ ఫోన్‌లో పోర్షే డిజైన్ ఎలిమెంట్స్, మెటల్ ఫ్రేమ్ ఉండనున్నట్లు సమాచారం.

* కెమెరా స్పెసిఫికేషన్లు
* ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్
* 200MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా
* 85mm ఫోకల్ లెంగ్త్, f/2.6 అపర్చర్
* ప్రధాన కెమెరాకు f/1.6 అపర్చర్

Read Also: Durga Temple Controversy: విజయవాడ దుర్గమ్మ ఆలయంలో మరో అపచారం.. శ్రీచక్ర అర్చనలో ఉపయోగించే పాలలో పురుగులు

బ్యాటరీ & ఛార్జింగ్
* 7,200mAh భారీ బ్యాటరీ
* 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.. ఈ ఫోన్ గేమింగ్, హెవీ యూజ్ చేసే వారికి చాలా ఉపయోగపడుతుంది.

ఇతర ముఖ్య ఫీచర్లు
* ప్రత్యేక డెడికేటెడ్ కెమెరా బటన్
* ప్రీమియం ఫ్లాగ్‌షిప్ హార్డ్‌వేర్
* Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్ (అంచనా)

ఈ నేపథ్యంలో హానర్ మ్యాజిక్ 8 RSR పోర్షే డిజైన్ ఫోన్ హైఎండ్ కెమెరా, భారీ బ్యాటరీ, ప్రీమియం డిజైన్‌తో అల్ట్రా-ఫ్లాగ్‌షిప్ సెగ్మెంట్‌ను టార్గెట్ చేయనుంది. జనవరి 19న అధికారిక లాంచ్ జరిగితే, ఇది టెక్ ప్రపంచంలో భారీ చర్చకు దారి తీసే అవకాశం ఉంది.

Exit mobile version