200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!

  • మే 25న చైనాలో HONOR 600 సిరీస్ అధికారిక లాంచ్
  • HONOR 600, HONOR 600 Pro ఫోన్లను విడుదల చేయనున్న హానర్
  • 200MP ప్రధాన కెమెరా ఈ సిరీస్ ప్రధాన హైలైట్
  • 6.57 అంగుళాల 1.5K OLED 120Hz డిస్‌ప్లే ఉండే అవకాశం..
Honor 600

Honor 600

HONOR 600 Series Launch: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మరోసారి సంచలనం సృష్టించేందుకు హానర్ (HONOR) సిద్ధమవుతోంది. ఈ మధ్యే మలేషియాలో గ్లోబల్ మార్కెట్ కోసం HONOR 600, HONOR 600 Pro స్మార్ట్‌ఫోన్లను పరిచయం చేసిన కంపెనీ.. ఈ నెల ప్రారంభంలో యూకేలో కూడా వాటిని విడుదల చేసింది. ఇప్పుడు ఈ సిరీస్‌ను మే 25న చైనాలో అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది.

HONOR 600 సిరీస్ ప్రత్యేకమైన ట్రిపుల్-కలర్ డిజైన్‌తో రానుంది. తొలిసారిగా డ్యూయల్ మ్యాగ్నెటిక్ క్లోజర్ ప్రాసెస్‌ను ఉపయోగించడం ఈ ఫోన్ల ప్రత్యేకతగా నిలుస్తోంది. డిజైన్, కలర్ స్కీమ్, ఫోన్ ఫినిషింగ్ పరంగా ఈ సిరీస్ కొత్త మార్పులను తీసుకువస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ సిరీస్‌లో ప్రధాన ఆకర్షణగా “Lucky Star” అనే కొత్త ఫ్లాగ్‌షిప్ కలర్‌ను హానర్ ఇప్పటికే ప్రకటించింది. వీటికి తోడుగా అబ్సిడియన్ బ్లాక్, గ్రీన్ ఆపిల్, లైట్ ఫెదర్ బ్లూ రంగుల్లో కూడా ఈ ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. గ్లోబల్ వెర్షన్‌తో పోలిస్తే చైనా మోడళ్ల డిజైన్‌లో కొంత మార్పు కనిపించనుంది. స్టాండర్డ్ HONOR 600 మోడల్‌లో డ్యూయల్ కెమెరాలతో సింగిల్ కెమెరా బార్ ఉండగా, Pro మోడల్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఇవ్వనున్నారు.

డిస్‌ప్లే విషయంలో రెండు ఫోన్లలో కూడా 6.57 అంగుళాల 1.5K OLED 120Hz స్క్రీన్ ఉండే అవకాశం ఉంది. అలాగే 200MP ప్రధాన కెమెరా ఈ సిరీస్ హైలైట్‌గా నిలవనుంది. ప్రాసెసర్ విషయానికి వస్తే, HONOR 600లో Snapdragon 7 Gen 4 చిప్ కొనసాగనుందని సమాచారం. అయితే హానర్ 600 Proలో గ్లోబల్ వెర్షన్‌లో ఉన్న స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ స్థానంలో మీడియాటెక్ డిమెంసిటీ 8550 SoC ఇవ్వనున్నట్లు లీకులు సూచిస్తున్నాయి.

బ్యాటరీ పరంగా కూడా ఈ ఫోన్లు భారీ అప్‌గ్రేడ్‌తో రానున్నాయి. HONOR 600లో 8600mAh బ్యాటరీ ఉండొచ్చని, HONOR 600 Proలో 8000mAh బ్యాటరీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గ్లోబల్ మోడళ్లలో 7000mAh బ్యాటరీలు మాత్రమే ఉన్న నేపథ్యంలో, చైనా వేరియంట్లలో పెద్ద బ్యాటరీలను అందించడం వినియోగదారులకు పెద్ద ప్లస్ పాయింట్‌గా మారనుంది.