Site icon NTV Telugu

iPhone: ఐఫోన్ యూజర్లకు హైరిస్క్ వార్నింగ్.. వెంటనే ఫోన్లు అప్‌డేట్ చేయండి, లేకపోతే..

Iphone

Iphone

iPhone: భారతదేశంలోని ఐఫోన్ యూజర్లకు ప్రభుత్వం హైరిస్క్ వార్నింగ్ జారీ చేసింది. వెంటనే ఫోన్ అప్డేట్ చేయలని సలహా ఇచ్చింది. ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) భారతదేశంలోని ఐఫోన్ వినియోగదారులకు భద్రతా హెచ్చరికను జారీ చేసింది. సాఫ్ట్ వేర్ అప్డేట్ చేయాలని లేకపోతే హ్యకర్ల బారిన పడి, వారు పూర్తిగా మీ ఫోన్లపై నియంత్రణ పొందే అవకాశం ఉంటుందని హెచ్చరించింది.

Read Also: HCL Layoff: మొన్నటి వరకు సాఫ్ట్‌వేర్ డెవలపర్… నేడు రాపిడో డ్రైవర్‌

అధికారిక వెబ్ సైట్ ప్రకారం.. ఐఫోన్ 6s, ఐఫోన్ 7 సిరీస్, ఐఫోన్ 8 సిరీస్ మరియు ఐఫోన్ SE ఫస్ట్-జెనరేషన్లతో పాటు పాత మోడళ్లలో కూడా హ్యాకర్ల బారిన పడే అవకాశం ఉందని CERT-In పేర్కొంది. ఐపాడ్ ఎయిర్, ప్రో లతో పాటు మినీ వినియోగదారులు కూడా ఐపాడ్ఓఎస్ కొత్త వెర్షన్ ని అప్డేట్ చేసుకోవాలని సూచించింది. ఆపిల్ ఐఫోన్‌ల కోసం కొత్త iOS అప్‌డేట్‌లను విడుదల చేయడం ప్రారంభించిన కొన్ని రోజుల తర్వాత ప్రభుత్వం నుంచి ఈ హెచ్చరికల వచ్చింది. ఐఫోన్ 6s, ఐఫోన్ 7, ఐఫోన్ ఎస్ఈ, ఐపాడ్ ఎయిర్ 2, ఐపాడ్ మిని(4 జనరేషన్) ఐపాడ్ టచ్, కోసం iOS 15.7.7, iPadOS 15.7.7 ఆప్డేట్లను విడుదల చేసింది.

కెర్నల్, వెబ్‌కిట్‌లోని సమస్యల కారణంగా ఆపిల్ ఐఓఎష్, ఐపాడ్ ఓఎస్ లో హాని కలిగించే అవకాశం ఉన్నాయని.. CERT-In పేర్కొంది. ఆపిల్ సఫరీ బ్రైజర్ లో వెబ్ కిట్ అనేది కోర్ టెక్నాలజీ. ఒకవేళ దీంట్లో ఏదైనా సమస్యలు ఏర్పడితే హ్యకర్లు మొబైళ్ల లక్ష్యంగా దాడి చేసే అవకాశం ఉందని తెలిపింది. వారు ఆర్బిటరీ కోడ్‌ని లక్ష్యంగా చేసుకున్న మొబైళ్లలో అమలుపరిచే అవకాశం ఉందని తెలిపింది. పూర్తిగా డివైజ్ పై హ్యాకర్లు కంట్రోల్ పొందే అవకాశం ఉందని తెలిపింది.

Exit mobile version