Google: తెరవెనుక కుట్ర పన్నాడు.. సస్పెండ్ అయ్యాడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమ రహస్యాల్ని ఇతర పక్షాలతో పంచుకుంటే.. ఏ కంపెనీ అయినా ఉపేక్షించదు. కనీసం ఆరోపణలు వచ్చినా సరే, వెంటనే ఆయా ఉద్యోగుల్ని సంస్థ నుంచి తొలగించేస్తారు. తాజాగా గూగుల్ సంస్థ కూడా అదే పని చేయడం పెను సంచలనంగా మారింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన వివరాల్ని గోప్యంగా ఉంచడం లేదన్న ఆరోపణలతో.. బ్లేక్ లెమోయిన్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను సస్పెండ్ చేసింది.
గూగుల్ సంస్థలో బ్లేక్ లెమోయిన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ విభాగంలో పని చేస్తున్నాడు. గూగుల్ ఏఐ ఎథిక్స్ గ్రూప్‌లోని మునుపటి సభ్యులైన మార్గరెట్ మిచెల్ వంటి వారితో ఇతను సంబంధం కలిగి ఉన్నాడని గూగుల్ భావిస్తోంది. ప్రాజెక్టు గురించి రహస్య సమాచారాన్ని బ్లేక్ వారితో పంచుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో, ఆ కంపెనీ అతడ్ని వెంటనే తొలగిస్తూ.. సంచలన నిర్ణయం తీసుకుంది. రీసెర్చర్‌గా ఉన్న ఆ ఇంజనీర్‌ను వేతనంతో కూడిన సెలవుపై ఉంచింది. కానీ.. ఈ సస్పెన్షన్ గురించి అడిగినప్పుడు, సిబ్బంది విషయాల గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని గూగుల్ వెల్లడించింది.
Also Read
- iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
- రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
- 144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
- 10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
అయితే.. బ్లేక్ లెమోయిన్ వాదన మాత్రం మరోలా ఉంది. ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇతను మాట్లాడుతూ.. ఏఐకి సంబంధించిన అంతర్గతంగా కొన్ని ప్రశ్నలు తాను సంధించానని, కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు అందుకు జవాబులిచ్చేందుకు తిరస్కరించారని బ్లేక్ తెలిపాడు. ఆ ప్రశ్నలు అడిగినందుకే తనని సస్పెండ్ చేశారని బ్లేక్ వాపోతున్నాడు. కాగా.. ఏఐ అనేది సెంటియెంట్గా మారిందని, కొత్త రోబోలో మానవుని తరహాలోనే ఫీలింగ్స్ ఉన్నాడని బ్లేక్ పేర్కొనడం హాట్ టాపిక్‌గా మారింది.
తాజావార్తలు
-
Sidharth – Kiara: రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ కపుల్!
-
Hanuman Ansh Telugu: ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్.. త్రివిక్రమ్ వెనకంజ వేయడనికి కారణం ఏంటి?
-
Bhatti Vikramarka: “మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా”.. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
-
Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
-
iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!