NTV Telugu Site icon

Google: తెరవెనుక కుట్ర పన్నాడు.. సస్పెండ్ అయ్యాడు!

Google Suspends Black Lemoine

Google Suspends Black Lemoine

తమ రహస్యాల్ని ఇతర పక్షాలతో పంచుకుంటే.. ఏ కంపెనీ అయినా ఉపేక్షించదు. కనీసం ఆరోపణలు వచ్చినా సరే, వెంటనే ఆయా ఉద్యోగుల్ని సంస్థ నుంచి తొలగించేస్తారు. తాజాగా గూగుల్ సంస్థ కూడా అదే పని చేయడం పెను సంచలనంగా మారింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన వివరాల్ని గోప్యంగా ఉంచడం లేదన్న ఆరోపణలతో.. బ్లేక్ లెమోయిన్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను సస్పెండ్ చేసింది.

గూగుల్ సంస్థలో బ్లేక్ లెమోయిన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్‌మెంట్ విభాగంలో పని చేస్తున్నాడు. గూగుల్ ఏఐ ఎథిక్స్ గ్రూప్‌లోని మునుపటి సభ్యులైన మార్గరెట్ మిచెల్ వంటి వారితో ఇతను సంబంధం కలిగి ఉన్నాడని గూగుల్ భావిస్తోంది. ప్రాజెక్టు గురించి రహస్య సమాచారాన్ని బ్లేక్ వారితో పంచుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో, ఆ కంపెనీ అతడ్ని వెంటనే తొలగిస్తూ.. సంచలన నిర్ణయం తీసుకుంది. రీసెర్చర్‌గా ఉన్న ఆ ఇంజనీర్‌ను వేతనంతో కూడిన సెలవుపై ఉంచింది. కానీ.. ఈ సస్పెన్షన్ గురించి అడిగినప్పుడు, సిబ్బంది విషయాల గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని గూగుల్ వెల్లడించింది.

అయితే.. బ్లేక్ లెమోయిన్ వాదన మాత్రం మరోలా ఉంది. ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇతను మాట్లాడుతూ.. ఏఐకి సంబంధించిన అంతర్గతంగా కొన్ని ప్రశ్నలు తాను సంధించానని, కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు అందుకు జవాబులిచ్చేందుకు తిరస్కరించారని బ్లేక్ తెలిపాడు. ఆ ప్రశ్నలు అడిగినందుకే తనని సస్పెండ్ చేశారని బ్లేక్ వాపోతున్నాడు. కాగా.. ఏఐ అనేది సెంటియెంట్‌గా మారిందని, కొత్త రోబోలో మానవుని తరహాలోనే ఫీలింగ్స్ ఉన్నాడని బ్లేక్ పేర్కొనడం హాట్ టాపిక్‌గా మారింది.