Google Search యూజర్లు అలర్ట్..! సెర్చ్‌ ఇంజిన్ లో పొంచి ఉన్న ముప్పు.. సేఫ్‌గా ఉండండి ఇలా.!

  • బ్లాక్ హ్యాట్ SEOతో గూగుల్‌ను మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్లు
  • సెర్చ్ రిజల్ట్స్‌లో నకిలీ లింకులు.. యూజర్లకు ప్రమాదకర ఉచ్చు
  • మాల్‌వేర్ దాడులతో పాస్‌వర్డ్లు, OTPల దొంగతనం
  • సురక్షిత బ్రౌజింగ్ కోసం తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు
Google Search

Google Search

Google Search Alert : మనం ఏదైనా సమాచారం కోసం వెంటనే గూగుల్‌ను ఆశ్రయిస్తాం. కానీ, మీరు వెతికే ఫలితాల్లో (Search Results) అన్నీ నిజమైనవే ఉంటాయని నమ్మకండి. సైబర్ నేరగాళ్లు ‘బ్లాక్ హ్యాట్ SEO’ (Black Hat SEO) అనే ప్రమాదకరమైన టెక్నిక్‌ను ఉపయోగించి, గూగుల్ అల్గారిథమ్‌లను మోసం చేస్తున్నారు. ఈ కొత్త రకం సైబర్ దాడి గురించి ప్రతి ఇంటర్నెట్ యూజర్ తప్పక తెలుసుకోవాలి.

ఏమిటీ బ్లాక్ హ్యాట్ SEO? హ్యాకర్లు మిమ్మల్ని ఎలా ట్రాప్ చేస్తారు?
సాధారణంగా వెబ్‌సైట్‌లు మంచి కంటెంట్ రాసి గూగుల్‌లో టాప్ ప్లేస్‌కు వస్తాయి. కానీ సైబర్ దొంగలు నిబంధనలకు విరుద్ధంగా, తప్పుడు మార్గాల్లో తమ వెబ్‌సైట్‌లను సెర్చ్ రిజల్ట్స్‌లో మొదటి స్థానంలో వచ్చేలా చేస్తారు.

మీరు ఏదైనా పాపులర్ సాఫ్ట్‌వేర్ (ఉదాహరణకు: WhatsApp Desktop, VLC, లేదా ఏదైనా బ్యాంకింగ్ యాప్) కోసం వెతికినప్పుడు, ఒరిజినల్ వెబ్‌సైట్ కంటే ముందే హ్యాకర్లు సృష్టించిన నకిలీ లింక్ కనిపిస్తుంది. మీరు దానిపై క్లిక్ చేయగానే మీ ప్రమేయం లేకుండానే మాల్‌వేర్ మీ డివైజ్‌లోకి ప్రవేశిస్తుంది.

మీ డివైజ్‌లోకి మాల్‌వేర్ వస్తే ఏం జరుగుతుంది?

 

  • పాస్‌వర్డ్ దొంగతనం: హ్యాకర్లు పంపే ఈ వైరస్ చాలా తెలివైనది. ఇది మీ ఫోన్ లేదా కంప్యూటర్‌లోకి చేరిన తర్వాత  మీ సోషల్ మీడియా , బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లను సీక్రెట్‌గా రికార్డ్ చేస్తుంది.
  • స్క్రీన్ క్యాప్చర్: మీరు ఫోన్‌లో ఏం చేస్తున్నారో హ్యాకర్లకు లైవ్ స్క్రీన్ షాట్స్ పంపిస్తుంది.
  • OTP మళ్ళింపు: మీ బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బులు డ్రా చేసేటప్పుడు వచ్చే ఓటీపీలను హ్యాకర్లకు రీడైరెక్ట్ చేస్తుంది.

సైబర్ వల నుండి తప్పించుకోవడానికి ఈ 4 సూత్రాలు పాటించండి.

  • URL స్పెల్లింగ్ చెక్ చేయండి: ఉదాహరణకు amazon.com కి బదులు amaz0n-deals.com అని ఉండవచ్చు. ఇలాంటి చిన్న మార్పులను గమనించాలి.
  • ప్రకటనల (Ads) పై ఒక కన్నేయండి: గూగుల్ సెర్చ్‌లో ‘Sponsored’ లేదా ‘Ad’ అని ఉండి, ఆ లింక్ అనుమానాస్పదంగా ఉంటే క్లిక్ చేయకండి.
  • HTTPS ఉందో లేదో చూడండి: వెబ్‌సైట్ అడ్రస్ బార్‌లో ప్యాడ్‌లాక్ (తాళం గుర్తు) ఉందో లేదో సరిచూసుకోండి.
  • అధికారిక స్టోర్స్ వాడండి: సాఫ్ట్‌వేర్ కావాలంటే నేరుగా కంపెనీ వెబ్‌సైట్ లేదా ప్లే స్టోర్, యాప్ స్టోర్ల నుండే డౌన్‌లోడ్ చేసుకోండి.

సాంకేతికత ఎంత పెరుగుతుందో, నేరాలు కూడా అంతే తెలివిగా మారుతున్నాయి. “అప్రమత్తంగా ఉండటమే సైబర్ భద్రతకు తొలి మెట్టు.” మీరు చేసే ఒక్క తప్పుడు క్లిక్ మీ జీవితాంతం సంపాదనను మాయం చేయగలదు. ఈ సమాచారాన్ని మీ స్నేహితులు , కుటుంబ సభ్యులతో పంచుకోండి.