ప్రతి వ్యక్తి చేతిలో స్మార్ట్‌ఫోన్.. అందులో ఇబ్బడి ముబ్బడిగా సోషల్ మీడియా యాప్స్‌తో పాటు మరికొన్ని యాప్స్… ఆ యాప్స్ ఇస్టాల్ చేసే సమయంలో.. వారు పెట్టే కండీషన్స్‌కు అన్నింటికీ ఒకే.. ఒకే కొట్టేయడమే.. ఇదే పెద్ద సమస్యగా మారుతుంది.. కొన్ని యాప్స్ ఫోన్‌ను గుల్ల చేస్తుంటే.. మరికొన్ని యాప్స్.. సదరు వినియోగదారుల సమాచారాన్ని మొత్తం లాగేస్తుంది.. అసలుకే ఎసరు పెట్టేవరకు వెళ్తోంది పరిస్థితి.. ఈ నేపథ్యంలో.. ప్రైవసీ, సెక్యూరిటీకి సంబంధించి సమస్యలు ఉన్న ఆండ్రాయిడ్ యాప్స్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఇప్పటికే చాలా యాప్స్ తొలగిస్తూ వచ్చింది.. నిబంధనలకు తగ్గట్టుగా లేనికారణంగా ఆ యాప్స్‌ను తొలగిస్తున్నట్టు చెబుతోంది.. తాజాగా.. మరికొన్ని యాప్స్‌ను కూడా తొలగించింది గూగుల్ ప్లే స్టోర్.. యాడ్ ఫ్రాడ్‌కు పాల్పడుతున్న యాప్స్‌ను గూగుల్ ప్లే స్టోర్ డిలీట్ చేసినట్టు ఓ సెక్యూరిటీ సంస్థ వెల్లడించింది.. ఆ యాప్స్ వల్ల యూజర్ల ఫోన్‌లోని బ్యాటరీని, డేటాను క్రమంగా తినేస్తున్నాయట.. ఆ యాప్స్.. యూజర్ ప్రమేయం లేకుండా వెబ్ పేజెస్ ఓపెన్ చేసి యాడ్స్‌పై క్లిక్ చేస్తున్నట్టు బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతున్నట్టు గుర్తించారు.
Read Also: Sadar festival: సదర్ ఉత్సవాల్లో ఘర్షణ.. కర్రలు, రాళ్లతో కొట్టుకున్న ఇరువర్గాలు
ఇలా యూజర్ల ప్రమోయం లేకుండానే బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతోన్న యాప్స్‌ను గుర్తించి.. గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించారు.. మెకేఫే గుర్తించిన 16 యాప్స్‌ను ప్లే స్టోర్ నుంచి గూగుల్ తొలగించినప్పటికీ.. కొన్ని ఫోన్లలో ఇంకా ఉన్నాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. ఇంతకీ గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించిన ఆ 16 యాప్స్ విషయానికి వస్తే.. బుసాన్‌బస్(BusanBus), జాయ్‌కోడ్ (JoyCode), స్మార్ట్ టాస్క్ మెనేజర్ (Smart Task Manager), ఫ్లాష్‌లైట్+ (Flashlight+), కరెన్సీ కన్వర్టర్ (Currency Converter), హైస్పీడ్ కెమెరా (High-Speed Camera), కే-డిక్షనరీ (K-Dictionary), మెమోక్యాలెండర్ (Memo Calender), ఫ్లాష్‌లైట్ (Flashlite), క్యాల్‌కల్ (Calcul), ఈజెడ్‌డికా (EzDica), క్విక్ నోట్ (Quick Not), ఈజెడ్ నోట్స్ (Ez Notes), ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ డౌన్‌లోడర్ (Instagram Profile Downloader) సహా మరికొన్ని యాప్స్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించినట్టు పేర్కొన్నారు.