గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు వివిధ ప్రదేశాలలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌ను తనిఖీ చేయవచ్చు. 2 బిలియన్ల కంటే ఎక్కువ మంది యాక్టివ్ యూజర్లు కొత్త ఫీచర్ నుండి ప్రయోజనం పొందనున్నారు. గాలి నాణ్యత పర్యవేక్షణను అందరికీ సులభతరం చేసే ఉద్దేశ్యంతో ఈ ఫీచర్ లాంచ్ చేశారు. ఈ వారంలో 100 కంటే ఎక్కువ దేశాల్లో ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. AQI ఫీచర్ ద్వారా.. ఇండియా, ప్రపంచంలోని అనేక ప్రాంతాలలోని ఏ ప్రదేశం యొక్క డేటాను గంట ప్రాతిపదికన ట్రాక్ చేయవచ్చు. గూగుల్ మ్యాప్స్‌లో కనిపించే AQI రీడింగ్‌లు చాలా సులభంగా అర్థమయ్యే ఫార్మాట్‌లో అందుబాటులో ఉన్నాయి. దీంతో.. వినియోగదారులు 0 నుండి 500 మధ్య రేటింగ్‌తో గాలి నాణ్యత స్థాయిని తనిఖీ చేయవచ్చు.
Naveen Ramgoolam: మారిషన్ ప్రధానిగా నవీన్ రామ్‌గూలం విజయం.. మోడీ అభినందన..
గూగుల్ మ్యాప్స్‌లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌ని ఎలా చెక్ చేయాలి..?
ఈ ఫీచర్‌ను యాక్సెస్ చేయడానికి వినియోగదారులు ముందుగా గూగుల్ మ్యాప్స్‌కి వెళ్లాలి.
ఆ తర్వాత లేయర్స్ ఐకాన్‌పై క్లిక్ చేయాలి.
తర్వాత ఎయిర్ క్వాలిటీ ఆప్షన్ ఎంచుకోండి.
ఆ తర్వాత వినియోగదారులు ఏ ప్రాంతంలోనైనా గాలి నాణ్యత సూచికను తనిఖీ చేయవచ్చు.
Winter: శీతాకాలంలో ఇంటి నిర్మాణం గురించి జాగ్రత్తలు..!
ఒక ప్రాంతం AQI స్థాయితో వినియోగదారులు ఇంట్లో ఉండాలా లేదా ప్రయాణం చేయాలా అనేదానిపై మెరుగైన నిర్ణయం తీసుకోవచ్చు. ఆరోగ్య దృక్కోణం నుండి 0 నుండి 50 మధ్య AQI రేటింగ్ మంచిది. AQI స్థాయి 51 నుండి 100 వరకు సంతృప్తికరంగా పరిగణించబడుతుంది. AQI 101 నుండి 200 మధ్య (మితమైన) పరిధిలోకి వస్తుంది. 201 నుండి 300 AQI స్థాయి ఆరోగ్య సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది. 301 నుండి 400 మధ్య ఆరోగ్యంపై చాలా చెడు ప్రభావాన్ని చూపుతుంది. 401 నుండి 500 (తీవ్రమైన) AQI చాలా ప్రమాదకరమైనది. అంటే ప్రతి ఒక్కరూ బహిరంగ కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. గాలి నాణ్యత ఆకుపచ్చ (మంచి) నుండి ఎరుపు (తీవ్రమైన) వరకు ఉండే రంగుల ద్వారా సూచించబడుతుంది. AQI పేలవమైన లేదా తీవ్రమైన స్థాయిలను సూచించినప్పుడు గూగుల్ మ్యాప్స్ జాగ్రత్తలు తీసుకోవడానికి సూచనలను కూడా అందిస్తుంది. ఉదాహరణకు.. వినియోగదారులు బహిరంగ కార్యకలాపాలను పరిమితం చేయాలని, ఇండోర్ ఎయిర్ ప్యూరిఫైయర్‌లను ఉపయోగించమని సలహా ఇస్తుంది.