Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Google I/O 2026: ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ (Google) వార్షిక డెవలపర్ కాన్ఫరెన్స్ Google I/O 2026లో పలు కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడల్స్, సాఫ్ట్వేర్ టూల్స్, కస్టమ్ AI చిప్స్‌ను ఆవిష్కరించింది. AI రంగంలో పెరుగుతున్న పోటీలో భాగంగా వినియోగదారులు, సంస్థల కోసం మరింత పవర్ ఫుల్ AI ఉత్పత్తులను తీసుకురావడంపై గూగుల్ దృష్టి పెట్టింది.
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఈ కార్యక్రమంలో జెమిని 3.5 ఫ్లాష్ (Gemini 3.5 Flash), జెమిని స్పార్క్ (Gemini Spark) అనే కొత్త AI అసిస్టెంట్, డాక్స్ లైవ్ వాయిస్ టూల్స్, TPU 8t, TPU 8i AI చిప్స్‌ను ప్రకటించారు. అలాగే గూగుల్ AI అల్ట్రా అనే కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్‌ను నెలకు 100 డాలర్ల ధరతో ప్రారంభించింది. మరోవైపు ఇప్పటికే ఉన్న టాప్-టియర్ అల్ట్రా ప్లాన్ ధరను 250 డాలర్ల నుంచి 200 డాలర్లకు తగ్గించింది.
Also Read
Gemini 3.5 Flash:
సుందర్ పిచాయ్ ప్రకారం.. ఈ Gemini 3.5 Flash అనేది “ఇంటెలిజెన్స్‌తో పాటు చర్యలను కూడా నిర్వహించగల కొత్త తరహా AI మోడల్స్‌లో మొదటిది. ఈ మోడల్ పాత వెర్షన్ అయిన Gemini 3.1 Pro కంటే మెరుగైన పనితీరును చూపుతుందని గూగుల్ తెలిపింది. గూగుల్ వెల్లడించిన వివరాల ప్రకారం.. Gemini 3.5 Flash ఒక సెకనుకు 289 టోకెన్లు జనరేట్ చేయగలదు. ఇది OpenAI chatGPT 5.5 మోడల్ కంటే చాలా వేగంగా ఉందని కంపెనీ పేర్కొంది.
Google Antigravity:
గూగుల్ “Google Antigravity” అనే AI ఏజెంట్ సిస్టమ్‌ను కూడా పరిచయం చేసింది. ఇది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రక్రియను ఆటోమేట్ చేయడంలో సహాయపడుతుంది. కోడింగ్ పనులను వేగంగా పూర్తి చేయడానికి ఇప్పటికే గూగుల్ అంతర్గత బృందాలు దీన్ని ఉపయోగిస్తున్నాయని సంస్థ తెలిపింది.
Gemini Spark:
గూగుల్ మరో కీలక ఫీచర్‌గా జెమినీ స్పార్క్ అనే AI అసిస్టెంట్‌ను పరిచయం చేసింది. ఇది జిమెయిల్, గూగుల్ డ్రైవ్ వంటి యాప్‌లలో పనులను స్వయంగా నిర్వహించగలదు. ఈ AI అసిస్టెంట్ మీ డిజిటల్ జీవనశైలిని సులభతరం చేస్తూ, మీ తరఫున పనులు పూర్తి చేస్తుందని సుందర్ పిచాయ్ తెలిపారు. ఉదాహరణకు ఒక పార్టీ ప్లాన్ చేయడానికి RSVPలు సేకరించడం, ఇమెయిల్స్ పంపడం, రిమైండర్లు సెట్ చేయడం, గూగుల్ స్లైడ్స్ ప్రెజెంటేషన్ తయారు చేయడం వంటి పనులను స్పార్క్ చేయగలదు. అంతేకాకుండా.. “Ghostwriter” ఫీచర్ ద్వారా యూజర్ రైటింగ్ స్టైల్‌కు అనుగుణంగా ఇమెయిల్స్ కూడా తయారు చేస్తుంది. ల్యాప్‌టాప్ మూసివేసినా కూడా బ్యాక్‌గ్రౌండ్‌లో పనులు కొనసాగించగల సామర్థ్యం దీనికి ఉంది.
Omni:
Demis Hassabis Google Omni అనే మీడియా జనరేషన్ టూల్‌ను ప్రదర్శించారు. ఈ టూల్ ఆడియో, వీడియో, ఇమేజెస్, టెక్స్ట్‌ను AI సహాయంతో సృష్టించగలదు. వీడియోలను సాధారణ మాటలతో ఎడిట్ చేయడం, స్టైల్స్ మార్చడం, సీన్స్ సవరించడం వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ టూల్ జెమినీ, గూగుల్ ఫ్లో , యూట్యూబ్ షార్ట్స్ ద్వారా అందుబాటులోకి రానుంది.
Google Docs Live:
గూగుల్ డాక్స్ Live అనే కొత్త వాయిస్ ఆధారిత డాక్యుమెంట్ టూల్‌ను కూడా ప్రకటించింది. ఇందులో యూజర్లు మాట్లాడుతుంటే.. జెమినీ ఆ మాటలను రియల్ టైమ్‌లో గూగుల్ Docs గా మార్చుతుంది. స్పీచ్ చెబుతూనే మార్పులు చేయడం, అదనపు సమాచారం చేర్చడం వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. భవిష్యత్తులో పూర్తిగా వాయిస్ ద్వారానే డాక్యుమెంట్లను తయారు చేయడం, ఎడిట్ చేయడం సాధ్యమవుతుందని గూగుల్ తెలిపింది.
TPU 8t, TPU 8i:
AI ట్రైనింగ్, ఇన్ఫరెన్స్ పనుల కోసం గూగుల్ TPU 8t & TPU 8i అనే రెండు కొత్త AI చిప్స్‌ను విడుదల చేసింది. గూగుల్ ప్రకారం.. TPU 8t పాత చిప్స్ కంటే మూడు రెట్లు ఎక్కువ కంప్యూటింగ్ శక్తిని అందిస్తుంది. అలాగే ఒకే డేటా సెంటర్ పరిమితులను దాటి AI ట్రైనింగ్‌ను స్కేల్ చేయగల సామర్థ్యం దీనికి ఉంది. ఇక ఈ కొత్త చిప్స్ సెకనుకు 1,500 టోకెన్ల వరకు ఇన్ఫరెన్స్ స్పీడ్‌ను అందించగలవని, అలాగే పవర్ వినియోగంలో కూడా రెండింతల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని గూగుల్ వెల్లడించింది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ “New Chapter” పోస్ట్ వైరల్.. ఈ సంకేతం అదేనా..?
-
TS Police Recruitment 2026: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 5,000 పోలీసు పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్!
-
BLA: గ్వాదర్ కోస్ట్ గార్డ్ క్యాంప్‌పై దాడి.. 30 మంది పాకిస్తానీ భద్రతా సిబ్బందిని హతమార్చినట్లు బీఎల్ఏ ప్రకటన
-
Keeway Hypvolt-R: భారత్‌లోకి కీవే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ప్రీమియం ఫీచర్లు, 180KM రేంజ్
-
Papikondalu Boat Tour: పాపికొండల విహారయాత్రకు గ్రీన్ సిగ్నల్.. 18 రోజుల తర్వాత మళ్లీ బోటు షికారు
ట్రెండింగ్
-
EV కారు కొనాలనుకుంటున్నారా? Hyundai Creta ఎలక్ట్రిక్ కు కొత్త BaaS ప్లాన్.. రూ.7 లక్షల వరకు తగ్గింపు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ అరంగేట్రంపై విమర్శలు.. మా ఇష్టం అంటూ మాజీలకు గట్టిగా ఇచ్చిపడేసిన బీసీసీఐ!
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!