Google Gemini Memory Summary: గూగుల్ జెమినై యూజర్లకు గుడ్‌న్యూస్.. కొత్త ఫీచర్ వచ్చేసింది..! ఇక ఆ టెన్షన్ లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Google Gemini Memory Summary: AI అందుబాటులోకి వచ్చిన తర్వాత.. ప్రైవసీ మరింత పోయిందనే విమర్శలు ఉన్నాయి.. ఎప్పటికప్పుడు యూజర్ల వివరాలు అందులో సేవ్ కావడం కొత్త సమస్యలకు దారి తీసినట్టు పలు ఘటనలు వెలుగులోకి వచ్చాయి.. అయితే, ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ తన AI అసిస్టెంట్ జెమినై (Google Gemini) వినియోగదారుల కోసం మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. అదే ‘మెమరీ సమ్మరీ’ (Memory Summary). ఈ ఫీచర్ ద్వారా గతంలో వినియోగదారులతో జరిగిన సంభాషణల నుంచి జెమినై సేకరించి గుర్తుంచుకున్న వ్యక్తిగత వివరాలను ఒకేచోట చూసుకోవచ్చు. అంతేకాకుండా అవసరమైతే ఆ వివరాలను ఎడిట్ చేయడం, తొలగించడం కూడా చేసుకోవచ్చు. AI తన గురించి ఏం గుర్తుంచుకుందో తెలుసుకునేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడనుంది.
గూగుల్ జెమినై మెమరీ సమ్మరీ ఫీచర్ అంటే ఏమిటి?
ఇప్పటికే జెమినైలో ఉన్న మెమరీ ఫీచర్‌కు కొనసాగింపుగా గూగుల్ కొత్త మెమరీ సమ్మరీని తీసుకొస్తోంది. గతంలో వినియోగదారులతో జరిగిన సంభాషణల ఆధారంగా AI గుర్తుంచుకున్న సమాచారాన్ని ఈ ఫీచర్ ఒకే విండోలో చూపిస్తుంది. వ్యక్తిగత చరిత్ర, నివాస ప్రాంతం, స్నేహితులు, పని, ఆసక్తులు, ఇష్టమైన విషయాలు వంటి సమాచారాన్ని వర్గీకరిస్తుంది. అయితే, వాటిపై క్లిక్ చేయడం ద్వారా జెమినై తమ గురించి గుర్తుంచుకున్న వివరాలను వినియోగదారులు పరిశీలించవచ్చు. అందులో ఏదైనా సమాచారం తప్పుగా ఉన్నా లేదా ఇకపై అవసరం లేదని భావించినా దాన్ని సవరించుకోవచ్చు లేదా పూర్తిగా తొలగించవచ్చు. అంతేకాకుండా మెమరీలో ఎప్పుడెప్పుడు మార్పులు జరిగాయి? ఏ సమాచారం కొత్తగా చేరింది? ఏ వివరాలు ఎడిట్ అయ్యాయి? అనే విషయాలను తెలుసుకునేందుకు మెమరీ మార్పుల చరిత్రను కూడా అందిస్తోంది.
Also Read
- Airtel Beats Jio: జియోకు షాకిచ్చిన ఎయిర్టెల్.. బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్, నెట్వర్క్ క్వాలిటీలో నెం.1గా..!
- Infinix Xpad 30: 11 ఇంచుల FHD+ డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో Infinix Xpad 30 ట్యాబ్లెట్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
- Qualcomm Layoffs: హైదరాబాద్ సహా భారత్‌లో క్వాల్కామ్ ఉద్యోగులకు బిగ్ షాక్..
- iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
గూగుల్ జెమినై మెమరీ సమ్మరీని ఎలా చూడాలి?
జెమినై సెట్టింగ్స్‌లోనే ఈ కొత్త ఫీచర్ అందుబాటులో ఉంటుంది. వినియోగదారులు ఈ క్రింది దశలను అనుసరించి తమ మెమరీ వివరాలను పరిశీలించవచ్చు.
1. ముందుగా జెమినై యాప్‌ను ఓపెన్ చేయాలి లేదా gemini.google.com వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
2. అనంతరం సెట్టింగ్స్ (Settings) విభాగంలోకి వెళ్లాలి.
3. అక్కడ పర్సనల్ ఇంటెలిజెన్స్ (Personal Intelligence) ఎంపికను ఎంచుకోవాలి.
4. తర్వాత మెమరీ సమ్మరీ (Memory Summary) పై క్లిక్ చేయాలి.
5. అక్కడ జెమినై గుర్తుంచుకున్న వ్యక్తిగత వివరాలను పరిశీలించవచ్చు.
6. అవసరమైన సమాచారాన్ని ఎడిట్ చేయడం లేదా తొలగించడం చేసుకోవచ్చు.
ఈ ఫీచర్ వల్ల గతంలో జరిగిన ప్రతి చాట్‌ను వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. జెమినై గుర్తుంచుకున్న సమాచారమంతా ఒకేచోట అందుబాటులో ఉంటుంది.
ఎవరికి అందుబాటులో ఉంది? ఏయే నిబంధనలు ఉన్నాయి?.. ప్రస్తుతం గూగుల్ మెమరీ సమ్మరీ ఫీచర్‌ను అమెరికాలోని యాక్టివ్ గూగుల్ AI ప్లాన్ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తోంది. ప్రస్తుతానికి ఇంగ్లిష్ భాషలో మాత్రమే ఈ ఫీచర్ పనిచేస్తోంది. జెమినై మొబైల్ యాప్‌తో పాటు వెబ్ వెర్షన్లోనూ ఉపయోగించుకోవచ్చు. అయితే కొంతమంది ఉచిత ఖాతా వినియోగదారులకు కూడా ఈ ఫీచర్ కనిపించినట్లు Gadgets360 నివేదించింది. దీన్ని బట్టి దశలవారీగా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ ఫీచర్ ఉపయోగించుకోవడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. వినియోగదారుల వయస్సు కనీసం 18 సంవత్సరాలు ఉండాలి. వ్యక్తిగత గూగుల్ ఖాతాతో జెమినైలో లాగిన్ అయి ఉండాలి. అలాగే అకౌంట్ సెట్టింగ్స్‌లో యాక్టివిటీ (Activity), మెమరీ (Memory) ఆప్షన్లు ఆన్‌లో ఉండాలి. వీటిలో ఏదైనా ఆఫ్ చేసి ఉంటే మెమరీ సమ్మరీ ఫీచర్‌ను ఉపయోగించలేరు. అయితే, ప్రస్తుతం అమెరికాలో మాత్రమే ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్న గూగుల్.. ఇతర దేశాలకు ఎప్పుడు విస్తరిస్తుందనే విషయంపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అలాగే ఇతర భాషల్లో ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందో కూడా వెల్లడించలేదు. మొత్తానికి AI అసిస్టెంట్ వినియోగదారుల వ్యక్తిగత సమాచారంపై మరింత నియంత్రణ కల్పించడంతో పాటు, తన మెమరీలో ఉన్న వివరాలను సులభంగా నిర్వహించుకునే అవకాశం కల్పించడమే ఈ కొత్త ఫీచర్ ప్రధాన ఉద్దేశంగా ఉంది..
తాజావార్తలు
-
Donald Trump: ఇరాన్‌పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. 93 శాతం కాదు, 100 శాతం విజయం సాధిస్తాం!
-
BMW M4 Competition: 9వ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు.. కొడుకుకు రూ.1.62 కోట్ల లగ్జరీ కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి!
-
Google Gemini Memory Summary: గూగుల్ జెమినై యూజర్లకు గుడ్‌న్యూస్.. కొత్త ఫీచర్ వచ్చేసింది..! ఇక ఆ టెన్షన్ లేదు..
-
Anirudh-Kavya Maran Wedding: ఒక్కటైన అనిరుధ్, కావ్య మారన్.. ఫొటోలు, వీడియోలు వైరల్.. రజనీకాంత్ మాస్ స్టెప్పులు
-
AP Local Body Elections: పంచాయతీ ఎన్నికల నగారా.. నేడు ఎస్ఈసీ కీలక ప్రకటన!
ట్రెండింగ్
-
Rohit Sharma: ముంబై ఇండియన్స్‌కి మరోసారి కెప్టెన్‌గా రోహితేనా..? స్టార్ ప్లేయర్ నోరుజారడంతో లీకైన అసలు మ్యాటర్..
-
Airtel Beats Jio: జియోకు షాకిచ్చిన ఎయిర్టెల్.. బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్, నెట్వర్క్ క్వాలిటీలో నెం.1గా..!
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్‌గా సంజూ శాంసన్‌కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!