NTV Telugu Site icon

Galaxy Z Fold 6: శాంసంగ్ నుంచి మరోస్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ చూస్తే వావ్ అనాల్సిందే..

Amaung Flod

Amaung Flod

ప్రముఖ మొబైల్ కంపెనీ శాంసంగ్ మార్కెట్ లోకి మరో కొత్త ఫోన్లను తీసుకురాబోతుంది.. ఇప్పటివరకు వరకు వచ్చిన అన్ని ఫోన్లు మొబైల్ ప్రియులను బాగా ఆకట్టుకున్నాయి.. ఈ క్రమంలో మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లో విడుదల చేస్తుంది.. శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చెయ్యనుంది.. ఈ ఫోన్ ఫీచర్స్, ధర గురించి వివరంగా తెలుసుకుందాం..

అయితే షావోమీ, హానర్‌, హువాయ్‌ లాంటి కంపెనీలు తక్కువ ధరలోనే ఫోల్డబుల్‌ ఫోన్‌లను లాంచ్‌ చేస్తున్న తరుణంలో పోటీని తట్టుకునేందుకు శాంసంగ్ అదిరిపోయే ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేయబోతున్నారు.. ఈ కొత్త ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 7.6 ఇంచెస్‌తో కూడిన ప్రైమీ డిస్‌ప్లేను అందించారు. ఇక సెకండరీ స్క్రీన్‌ను 6 ఇంచెస్‌తో ఇచ్చారు.ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 2 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.. ఇంకా ఫింగర్ ప్రింట్ సెన్సార్స్ తో ఉండేలా అద్భుతమైన ఫీచర్స్ ను అందించారు..

ఇక ధర విషయానికొస్తే.. శాంసంగ్ ఈ ఫోన్ ధరను రూ. 1,54,999గా నిర్ణయించింది. దీంతో కేవలం ప్రీమియం యూజర్లను మాత్రమే టార్గెట్‌ చేసుకొని తీసుకొచ్చినట్లైంది. అయితే తాజాగా బడ్జెట్‌ వేరియంట్‌లో ఫోల్డబుల్ ఫోన్‌ను తీసుకొచ్చే పనిలో ఉంది.. ఇక ఈ ఫోల్డబుల్ ఫోన్‌ను అందుబాటు ధరలో తీసుకొస్తున్నట్లు చెబుతున్నారు. ఫోల్డబుల్‌ ఫోన్‌ మార్కెట్‌లో మరింత దూసుకెళ్లడమే లక్ష్యంగా ఈ ఫోన్ ను మార్కెట్ లోకి వదులుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.. ఇక మరో విషయం ఏంటంటే ఈ ఫోన్ కోసం ఫ్రీ బుకింగ్స్ ను వెతుకుతున్నారు.. మరి ఎప్పుడు లాంచ్ చేస్తారో చూడాలి..