NTV Telugu Site icon

Online Scams: మీ ఫోన్ హ్యాక్ కాకూడదంటే ఈ టిప్స్ పాటించండి

Online Scams

Online Scams

ప్రస్తుత కాలంలో బ్యాంకింగ్‌ కార్యకలాపాలన్నీ ఆన్​లైన్​లోనే జరుగుతున్నాయి. దీంతో చాలా మంది బ్యాంకు లకు వెల్లడం మానేశారు. సులభంగా మొబైల్ బ్యాంకింగ్​, నెట్ బ్యాంకింగ్​ చేయడానికే అలవాటు పడ్డారు. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ వల్ల ఆర్థిక కార్యకలాపాలు చాలా సులభతరంగా మారాయి. కానీ అదే సమయంలో సైబర్ నేరాలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. సైబర్‌ నేరగాళ్లు నిరంతరం కొత్త కొత్త విధానాలతో వ్యక్తులను, సంస్థలను మోసాలకు పాల్పడుతున్నారు. అందుకే ప్రతి ఒక్కరూ బ్యాంకింగ్‌ స్కామ్స్​ గురించి.. డిజిటల్‌ పేమెంట్స్​ మోసాల గురించి తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలి.

READ MORE: RN Agarwal: భారతీయ అగ్ని క్షిపణి పితామహుడు ఆర్ఎన్ అగర్వాల్ కన్నుమూత

ప్రస్తుతం ఆన్లైన్ మోసాలు పెరిగాయి. ఓ లింక్ పంపి దానిని క్లిక్ చేయమని ప్రోత్సహించేలా మెసేజ్ పెడుతున్నారు. కొందరు గ్రహించి తిరస్కరిస్తున్నారు. కానీ మరి కొందరూ ఎదో ఆశతో నొక్కుతున్నారు. దీంతో వారికి తెలియకుండానే మీ ఖాతాలోని డబ్బు మాయమైపోతుంది. ఆన్‌లైన్ మోసాల బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఆన్‌లైన్ మోసాలు ఎక్కువగా మొబైల్ ఫోన్ల ద్వారానే జరుగుతున్నాయి. అందువల్ల భద్రతా చర్యలు తీసుకోవాలి. సైబర్ స్కామర్‌లు స్కామ్‌లను నిర్వహించడానికి తరచుగా వినియోగదారు స్మార్ట్‌ఫోన్ OSని ఉపయోగిస్తారు. ఇవి మిమ్మల్ని CERT-In రూపంలో హెచ్చరించగలవు. ఇది నిర్దిష్ట అప్లికేషన్‌లోని సున్నితమైన డేటాను లీక్ చేయగలదు. అందుకే స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఎప్పటికప్పుడు సాఫ్ట్ వేర్ ను అప్ డేట్ చేసుకోవాలి. దీనివల్ల మోసాల బారిన పడే ప్రమాదం తగ్గుతుంది.

READ MORE:Vijayawada Airport: ఢిల్లీ- అమరావతి మధ్య ఇండిగో విమాన సర్వీసులు.. ఎప్పటి నుంచి అంటే..?

సైబర్ నేరస్థులు తరచుగా స్పామ్, హానికరమైన లింక్‌లను SMS రూపంలో పంపుతారు. లాభదాయకమైన ఆఫర్ల రూపంలో ఉంటాయి. ట్రస్ట్ లింక్‌లపై క్లిక్ చేయడం ద్వారా మీ మొబైల్‌ను హ్యాక్ చేయవచ్చు. సైబర్ మోసగాళ్లు ఇటీవల సిమ్ స్వాప్ స్కామ్‌లు చేస్తున్నారు. ఇందుకోసం నకిలీ సిమ్ కార్డులను ఉపయోగిస్తున్నారు. ఈ స్కామ్‌ బారిన పడకుండా ఉండేందుకు స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు తమ సిమ్‌ను పాస్‌వర్డ్‌తో లాక్ చేయాలి. పాస్‌వర్డ్‌ను ఎట్టిపరిస్థితుల్లో కూడా ఎవ్వరికీ ఇవ్వొద్దు. బయట ఉన్నప్పుడు, మీ ఫోన్‌లో డేటా అయిపోతున్నప్పుడు పబ్లిక్ Wi-Fiని ఉపయోగించాల్సిన అవసరం ఉన్నట్లయితే, స్మార్ట్‌ఫోన్‌లో VPNని డౌన్‌లోడ్ చేసుకోండి. ఇది మీ ఫోన్‌ను మోసాల నుండి రక్షిస్తుంది. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు తమ ఆధార్, బ్యాంకింగ్ సమాచారం యొక్క డిజిటల్ కాపీని ఫోన్‌లో ఉంచుతారు. కానీ సైబర్ అటాకర్లు ఫోన్ ని హ్యాక్ చేసి వాటిని తీసుకునే అవకాశం ఉంది. అందుకే ఫొటోల కోసం సెక్యూరిటీ పాస్ వర్డ్ పెట్టడం మంచింది.