NTV Telugu Site icon

IPhone 12 : ఐఫోన్‌ 12పై ఫిప్‌కార్డ్‌ భారీ డిస్కౌంట్‌..

Iphone 12

Iphone 12

Flipkart Offer on IPhone 12 Mobile.
ప్రముఖ ఈ కామర్స్‌ ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్‌ సేవింగ్స్‌ డే సేల్‌ ప్రారంభమైంది. అయితే ఎప్పడూ.. కొత్త కొత్త ఆఫర్లతో కవ్వించే ఫ్లిప్‌కార్ట్‌ ఇప్పుడు స్మార్ట్‌ ఫోన్లపై భారీ డిస్కౌంట్‌ ఇస్తోంది. ఐఫోన్ 12 అతిత‌క్కువ‌గా రూ 52,999కే సిటీ బ్యాంక్‌, కొటాక్ బ్యాంక్‌, ఆర్‌బీఎల్ బ్యాంక్ కార్డుదారుల‌కు ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో అందుబాటులో ఉంది. ఐఫోన్ 12 64జీబీ వేరియంట్ గ‌తంలో రూ 65,999కి లిస్ట్ కాగా.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా ఈ ఫోన్ ధ‌ర రూ 52,999కే అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ మ‌రో రూ 1000 అద‌నంగా డిస్కౌంట్ ఆఫ‌ర్ చేస్తుండగా.. దీనికి తోడు పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయ‌ద‌లుచుకున్న వారికి ఎక్స్ఛేంజ్ ఆఫ‌ర్ కూడా అందుబాటులో ఉన్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది.

ఇక నాన్ ప్లస్ మెంబ‌ర్‌కు ఐఫోన్ 12 ప్ర‌స్తుతం రూ 59,999కి లిస్ట‌వ‌గా యాక్సిస్ బ్యాంక్ కార్డు ఆఫ‌ర్‌తో ఇది రూ 56,999కి కొనుగోలు చేయవచ్చు. దీనికి ఎక్స్ఛేంజ్ ఆఫ‌ర్ అద‌నంగా అందుబాటులో ఉండటం విశేషం. ఫ్లిప్‌కార్ట్ డీల్స్‌లో ఐఫోన్ 12 రూ 52,000కే ల‌భిస్తుండ‌టంతో మెరుగైన ఐఓఎస్ ఫోన్ రీజ‌న‌బుల్ రేట్‌లో సొంతం చేసుకోవ‌చ్చ‌ని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఐఫోన్ 12 నెక్ట్స్ జ‌న‌రేష‌న్ న్యూర‌ల్ ఇంజిన్ ప్రాసెస‌ర్‌తో కూడిన ఏ14 బ‌యోనిక్ చిప్‌తో.. 6.1 ఇంచ్ సూప‌ర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లేతో పాటు ముందు భాగంలో నైట్ మోడ్‌తో 12ఎంపీ ట్రూడెప్త్ ఫ్రంట్ కెమెరా, 4కే డోల్బీ విజ‌న్ హెచ్‌డీఆర్ రికార్డింగ్‌, ప్రొటెక్ష‌న్ కోసం ఐఫోన్ 12 సిరామిక్ షీల్డ్ కోటింగ్‌తో క‌స్ట‌మ‌ర్ల‌ను ఆకర్షిస్తోంది.