NTV Telugu Site icon

Flipkart : 8 వేలకే 32 అంగుళాల స్మార్ట్‌ టీవీ..

Infinix Tv Y1

Infinix Tv Y1

Flipkart Offer on Infinix TV Y1.

ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్‌లతో స్మార్ట్‌ టీవీలు అందుబాటులో ఉన్నాయి. 10 వేల రూపాయల లోపు స్మార్ట్‌ టీవీ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది శుభవార్తే. ఇన్ఫినిక్స్‌ ఇండియా (ట్రాన్సియాన్‌ గ్రూపు) తక్కువ ధరలో ‘వై1 స్మార్ట్‌ టీవీ’ ఇటీవల మార్కెట్‌లోకి విడుదల చేసింది. రూ. 8,999లకే 32 అంగుళాల ఈ స్మార్ట్‌ టీవీని సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయాలకు అందుబాటులో ఉంది. 32 అంగుళాల ‘వై1 స్మార్ట్‌ టీవీ’ని ధర రూ.8,999కు ఇన్ఫినిక్స్‌ అందిస్తోంది. ఈ టీవీలో ప్రైమ్‌ వీడియో, యూట్యూబ్, సోనీలివ్, జీ5, ఎరోస్‌నౌ, ఆజ్‌తక్‌ తదితర ఓటీటీ యాప్‌లు ముందుగానే ఇన్‌స్టాల్‌ చేసి ఉంటాయని  తెలిపింది ఇన్ఫినిక్స్‌ ఇండియా.

SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు 10 శాతం తగ్గింపును పొందవచ్చు, అంటే రూ.900. తగ్గింపు లభిస్తుంది. దీంతో కేవలం 8,099 రూపాయలకే వై1 స్మార్ట్‌టీవీని సొంతం చేసుకోవచ్చని ఇన్ఫినిక్స్‌ ఇండియా పేర్కొంది. డాల్బీ ఆడియో సౌండ్‌ సిస్టమ్‌తో, 20 వాట్‌ అవుట్‌పుట్‌ స్పీకర్లతో ఇది వస్తుంది. అలాగే, 512 ఎంబీ క్వాడ్‌కోర్‌ ప్రాసెసర్, 4జీబీ స్టోరేజీతో, మూడు హెచ్‌డీఎంఐ, రెండు యూఎస్‌బీ పోర్ట్‌లు, ఒక ఆప్టికల్, ఒకటి లాన్, ఒకటి మిరాకాస్ట్, వైఫై, క్రోమ్‌కాస్ట్‌తో ఉంటుందని ఇన్ఫినిక్స్‌ వెల్లడించింది.