Entry-Level Jobs Down 29%: ఉద్యోగ రంగంలో పరిస్థితులు ఎప్పుడు ఎలా మారతాయో చెప్పలేం. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రావడంతో చాలా ఉద్యోగాలపై ఒత్తిడి పెరుగుతోంది. ఒకవైపు.. కొన్ని ఉద్యోగాలు కనుమరుగవుతుంటే, మరోవైపు కొత్త రకాల ఉద్యోగాలు మార్కెట్‌లోకి వస్తున్నాయి. కానీ ఈ మార్పుల ఎంట్రీ లెవెల్ ఉద్యోగులు అధికంగా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పుడిప్పుడే చదువు పూర్తిచేసుకుని ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వాళ్లకు ప్రస్తుతం గడ్డుకాలం ఏర్పడింది. తాజా నివేదికల ప్రకారం, ఎంట్రీ లెవెల్ ఉద్యోగాల్లో దాదాపు 29 శాతం వరకు తగ్గుదల వచ్చింది. 2025 సంవత్సరాన్ని చూస్తే, ఉద్యోగ మార్కెట్‌లో కొత్తగా ప్రవేశించాలనుకునే వారికి పరిస్థితి మరింత కష్టంగా మారింది. ఒకేసారి పెద్ద సంఖ్యలో విద్యార్థులు చదువు పూర్తిచేసి ఉద్యోగాల కోసం వెతకడం మొదలుపెట్టారు. కానీ అందుకు తగ్గట్టు ఉద్యోగ అవకాశాలు మాత్రం లభించలేదు.
READ MORE: స్టైలిష్ డిజైన్, హైబ్రిడ్ ఇంజిన్, ADAS ఫీచర్లతో 2026 Renault Duster వచ్చేసింది.. ఫీచర్స్ ఇవే..!
రాండ్స్టాడ్ అనే సంస్థ ప్రపంచవ్యాప్తంగా 12.6 కోట్ల ఉద్యోగాలపై చేసిన అధ్యయనంలో ఒక ఆసక్తికర విషయం బయటపడింది. 2024 జనవరి నుంచి చూస్తే.. ప్రారంభ స్థాయి ఉద్యోగాలు దాదాపు 29 శాతం తగ్గాయి. మొదట ఇది తాత్కాలిక సమస్యగా అనిపించినా, ఇప్పుడు ఇది శాశ్వత మార్పుల వైపు వెళ్తున్నట్టు కనిపిస్తోంది. అమెరికాలో పరిస్థితిని చూస్తే, యువతలో నిరుద్యోగం మరింత ఆందోళన కలిగిస్తోంది. జూలై నెలలో అక్కడ యువ నిరుద్యోగ రేటు 10.8 శాతానికి చేరింది. ఆసియా, ఆఫ్రికా దేశాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. భారత్‌లో యువ నిరుద్యోగం సుమారు 17 శాతం ఉండగా, చైనాలో 16.5 శాతం, మొరాకోలో అయితే దాదాపు 36 శాతం వరకు ఉంది. బ్రిటన్‌లో 2024లో కేవలం 17 వేల ప్రారంభ స్థాయి ఉద్యోగాల కోసం 1.2 కోట్ల మంది గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇది ఉద్యోగాల కోసం పోటీ ఎంత తీవ్రమైందో ఇదే ఒక ఉదాహరణ.
READ MORE: US-Europe: అమెరికా లేకుంటే ఐరోపాకు భద్రతా ఎక్కడది? నాటో చీఫ్ సంచలన వ్యాఖ్యలు
చాలామంది ఉద్యోగాలు పోవడానికి కారణం ఏఐ మాత్రమేనని భావిస్తున్నారు. కానీ వరల్డ్ ఎకనామిక్ ఫోరం నివేదిక ప్రకారం.. అసలు కారణం ఒక్క ఏఐ మాత్రమే కాదు.. కంపెనీలు కొత్తగా ఉద్యోగాలు ఇవ్వడంలో నెమ్మదిగా వ్యవహరించడం, ఆర్థిక అనిశ్చితి వంటి అంశాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో జెన్-జెడ్ యువత ఇప్పుడు సంప్రదాయ ఉద్యోగాలకంటే శిక్షణా కార్యక్రమాలు, వృత్తి నైపుణ్య కోర్సుల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. భవిష్యత్తు ఎలా ఉండబోతుందనే ప్రశ్నకు కూడా ఈ నివేదికలు కొన్ని సమాధానాలు ఇస్తున్నాయి. 2030 నాటికి సుమారు 7.8 కోట్ల కొత్త ఉద్యోగాలు ఏర్పడే అవకాశం ఉందని అంచనా. అయితే ప్రస్తుతం ఉన్న ఉద్యోగాల్లో 22 శాతం ఉద్యోగాలు పెద్ద మార్పులకు లోనవుతాయి. దాదాపు 85 శాతం కంపెనీలు తమ ఉద్యోగులకు కొత్త నైపుణ్యాలు నేర్పించడంపై దృష్టి పెడుతున్నాయి. ఇందులో ముఖ్యంగా ఏఐకి సంబంధించిన నైపుణ్యాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.
