Site icon NTV Telugu

Electric Scooter: మార్కెట్లోకి మరో కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200 కిమీ.. వివరాలివే..

Ambier Scoo

Ambier Scoo

మన దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాల ట్రెండ్ కొనసాగుతుంది.. ఒక పక్క కార్లు, మరో పక్క బైక్‌లు స్కూటర్లు పెద్ద ఎత్తున లాంచ్‌ అవుతున్నాయి. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ వాహనాలను అన్ని దేశాలకు అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.. విద్యుత్ శ్రేణి వాహనాలను ఉత్పత్తి చేసేందుకు ప్రముఖ కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి..అదే సమయంలో వినియోగదారులు కూడా ఎక్కువగానే ఎలక్ట్రిక్‌ వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇండియన్‌ మార్కెట్లో ఎక్కువగా సేల్‌ అవుతున్నాయి. ఇదే క్రమంలో కంపెనీలు కూడా పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్‌ స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. టాప్‌ బ్రాండ్లతో పాటు స్టార్టప్‌ లు కూడా ఎలక్ట్రిక్‌ స్కూటర్లను ఉత్పత్తి చేస్తున్నాయి..

తాజాగా మధ్యప్రదేశ్ కు సంబందించిన ప్రముఖ ఈవీ తయారీ సంస్థ ఎనిగ్మా ఆటోమొబైల్స్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ యాంబియర్ ఎన్‌8ని విడుదల చేసింది. అంబియర్ ఎన్‌8 లోని బ్యాటరీ రెండు నుంచి నాలుగు గంటల్లోనే ఫుల్‌ చార్జింగ్‌ అవడంతో పాటు సింగిల్‌ చార్జ్‌పై 200 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని కంపెనీ ప్రకటించింది.. ఈ స్కూటర్ ఫీచర్స్, ధర గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

యాంబియర్ ఎన్‌8 1500-వాట్ మోటార్‌ను కలిగి ఉంది. ఇది గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించగలుగుతుంది. ఎనిగ్మా ప్రకారం ఈ స్కూటర్ 200 కిలోల లోడ్ కెపాసిటీని కలిగి ఉంది. అదనంగా, స్కూటర్ 26-లీటర్ బూట్ సామర్థ్యాన్ని అందిస్తుంది.. ఇది కంపెనీ యాప్ ద్వారా కనెక్ట్ అయ్యి ఉంటుంది.. ఈ ప్రత్యేక యాంబియర్ ఎన్8 ధర మీరు ఉండే ప్రదేశాన్ని బట్టి మారుతుంటుంది. ప్రారంభ ధర రూ. 1,05,000 నుంచి రూ. 1,10,000 ఎక్స్-షోరూమ్ వరకు ఉంటుంది. ఎనిగ్మా ఆటోమొబైల్స్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం ఆన్‌లైన్ బుకింగ్‌లను ప్రారంభించింది. ఎన్‌8 థండర్‌స్టార్మ్ ఐదు రంగులలో లభిస్తుంది – గ్రే, వైట్, బ్లూ, మ్యాట్ బ్లాక్, సిల్వర్ కలర్లో లభిస్తున్నాయి.. ఈ స్కూటర్‌ సింగిల్‌ చార్జ్‌ పై 200 కిలోమీటర్ల రేంజ్‌ ఇస్తుందని, దీంతో కొద్ది దూరాలకే చార్జింగ్‌ సమస్య ఉత్పన్నం కాదని స్పష్టం చేశారు.. మార్కెట్ లోకి వచ్చిన వెంటనే వీటికి డిమాండ్ కూడా పెరిగింది..

Exit mobile version