NTV Telugu Site icon

Sunita Williams Salary: సునీతా విలియమ్స్ జీతం ఎంతో తెలుసా?.. షాక్ అవ్వాల్సిందే!

Sunita Williams

Sunita Williams

బోయింగ్ విమానంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) చేరుకున్న సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ఈ సంవత్సరం తిరిగి రాలేరు. ఈ ఏడాది వ్యోమగాములు తిరిగి రావడం సాధ్యం కాదని నాసా శనివారం (ఆగస్టు 24) తెలిపింది. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ జూన్ 2024లో బోయింగ్ విమానంలో అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న విషయం తెలిసిందే. బోయింగ్ స్టార్‌లైనర్ క్యాప్సూల్‌లో లోపం కారణంగా వారి రిటర్న్ వాయిదా పడింది. ఇద్దరు వ్యోమగాములు ఇప్పుడు స్పేస్‌ఎక్స్ రాకెట్‌లో భూమికి తిరిగి రావాల్సి ఉంటుందని నాసా చీఫ్ బిల్ నెల్సన్ చెప్పారు. స్టార్‌లైనర్ యొక్క ప్రొపల్షన్ సిస్టమ్ లోపభూయిష్టంగా ఉందని, అందువల్ల ఈ వాహనం నుంచి వ్యోమగాములు భూమికి తిరిగి రావడం చాలా ప్రమాదకరమని ఆయన తెలిపారు. ఇప్పుడు ఇద్దరు వ్యోమగాములు 2025 ఫిబ్రవరిలో భూమికి తిరిగి వస్తారని నాసా తెలిపింది.

READ MORE: Unnatural S*x: ఓరి దరిద్రుడా.. కుక్కతో అదేం పనిరా

కాగా.. తాజాగా వ్యోమగాములకు జీతాలుకు సంబంధించి చాలా మందికి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వాస్తవానికి.. వారు పని చేస్తున్న అంతరిక్ష సంస్థ, అనుభవం, నిర్దిష్ట మిషన్ సమయంలో వారు నిర్వహించే బాధ్యతలను బట్టి మారుతూ ఉంటాయి. అంతరిక్ష పరిశోధనలో తరచుగా ముందంజలో ఉండే నాసా వ్యోమగాములు సాధారణంగా యూఎస్ ప్రభుత్వ జనరల్ షెడ్యూల్ (GS) ఫెడరల్ పే స్కేల్ కింద వర్గీకరించబడతారు. అంతరిక్ష పరిశ్రమపై మార్కెట్ ఇంటెలిజెన్స్‌ను అందించే స్పేస్ ఇంపల్స్ షేర్ చేసిన డేటా ప్రకారం.. నాసా వ్యోమగాములు సంవత్సరానికి $152,258.00 (1.27 కోట్లకు పైగా) సంపాదిస్తున్నారు. “ఈ వేతన రేటు 2024 పే షెడ్యూల్‌లను ప్రకారం నిర్ధారించాం. 2025లో ఏదైనా పెరుగుదలను సంభవిస్తే జీతాన్ని సర్దుబాటు చేస్తాం. ” అని నాసా సైట్ లో పేర్కొంది. జీతం, ప్రయోజనాలు, సెలవులు, ఇతర అలవెన్సులు ఉంటాయి. ఇదే జీతం సునీతా విలియమ్స్ కి కూడా అందుతుంది. కాగా.. సైనిక నేపథ్యం ఉన్న నాసా వ్యోమగాములకు వేతనాలు భిన్నంగా ఉంటాయి.

READ MORE: Honor killing: పేరెంట్స్ గొంతుకోసి చంపిన కొడుకు.. తల, మొండం వేరు చేసి..!

సునీతా విలియమ్స్ గురించి మరిన్ని విషయాలు..

ఇదిలా ఉండగా.. సునీతా విలియమ్స్ అంతరిక్ష పరిశోధన ప్రపంచంలో అత్యంత ప్రఖ్యాతి గడించారు. పలు అంతరిక్ష మిషన్లలో పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ISS)లో ఫ్లైట్ ఇంజనీర్‌గా పని చేశారు. విలియమ్స్ మొత్తం 322 రోజులకు పైగా అంతరిక్షంలో గడిపినందుకు నాసా అత్యంత అనుభవజ్ఞులైన వ్యోమగాములలో చోటు దక్కించుకున్నారు. నాసా మిషన్ల సమయంలో ఆమె అనేక ప్రయోగాలు చేశారు. అనేక అంతరిక్ష నడకలను (స్పేస్ వాక్స్) నిర్వహించి రికార్డులను నెలకొల్పారు. విలియమ్స్ తండ్రి దీపక్ పాండ్యా, గుజరాత్‌లోని మెహసానాకు చెందిన భారతీయ సంతతికి చెందిన న్యూరో అనాటమిస్ట్. ఆమె తల్లి, ఉర్సులిన్ బోనీ పాండ్యా (నీ జలోకర్), స్లోవేనియన్-అమెరికన్. ఈ ప్రత్యేకమైన సంస్కృతుల సమ్మేళనం ఆమె అసాధారణ విజయాలకు దోహదపడింది అని చెప్పవచ్చు.