NTV Telugu Site icon

Dell: వారానికి 3 రోజులు ఆఫీసుకు రావాల్సిందే.. ఉద్యోగులకు డెల్ హెచ్చరిక..

Dell

Dell

Dell: కరోనా మహమ్మారి కారణంగా అన్ని టెక్ సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్(WFH) ప్రకటించాయి. అయితే, ఇప్పటికీ కొందరు ఉద్యోగులు ఇంకా రిమోట్ విధానంలో పనిచేస్తున్నారు. ఇప్పటికే పలు కంపెనీలు ఉద్యోగులను ఆఫీసులకు రావాలని ఆదేశిస్తున్నాయి. ఒకవేళ రాకుంటే పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాయి.

Read Also: Supreem Court: ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి.. 30 ఏళ్ల జైలు శిక్ష

ఇదిలా ఉంటే, తాజాగా డెల్ తన ఉద్యోగులను వారానికి మూడు రోజులు ఆఫీసులకు రావాలని ఆదేశించింది. లేకుంటే కెరీర్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పింది. సోమవారం సిబ్బందికి పంపిన మోమోలో ఈ మేరకు పేర్కొంది. ఉద్యోగుల ఇంటరాక్షన్, ఇన్నోవేషన్ ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది. డెల్ కంపెనీలో 60 శాతం మంది ఇంటి నుంచే పనిచేస్తున్నారు. కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో తన విధానాన్ని సవరించింది. మార్చి 2023లో, డెల్ కార్యాలయాల నుంచి గంట లోపు ఉండే సిబ్బంది వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసులకు రావాలని కోరింది, తాజాగా దగ్గర దూరంతో సంబంధం లేకుండా అందరు ఉద్యోగులు కూడా 3 రోజులు ఆఫీసుకు తప్పకుండా రావాల్సిందే అని ఆదేశించింది.

తక్కువ వేతనం కలిగిన ఉద్యోగులు పూర్తి సమయం రియోట్ వర్క్ ఎంచుకోవచ్చని, అలా చేయడం ద్వారా కెరీర్ పురోగతికి ఆటంకం ఉండొచ్చని, రిమోట్ వర్క్ ‘‘కెరీర్ లిమిటింగ్’’గా ఉంటుందని కంపెనీ పేర్కొంటున్నట్లు సమాచారం. అన్ని టెక్ దిగ్గజాల్లాగే డెల్ కూడా గతేడాది 6000 మంది కంటే ఎక్కువ మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. ఇది దాని వర్క్ ఫోర్స్‌లో 5 శాతం.