Site icon NTV Telugu

Malware: మీ ఫోన్లో ఈ యాప్ ఉంటే డేంజర్.. మీ రికార్డులన్నీ బట్టబయలే

Malware

Malware

Malware: రోజు రోజుకు సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. సైబర్ నేరాల దృష్ట్యా పోలీసులు ఎన్ని నివారణ చర్యలు తీసుకున్నప్పటికీ ఇంకా పెట్రేగిపోతున్నారు నేరగాళ్లు. టెక్నాలజీని ఉపయోగిస్తూ.. ఫోన్ లో ఉన్నా అంతా డేటాను లాగేస్తున్నారు. ఫలితంగా మన ఫోన్ లో ఉన్న ప్రైవసీ, డేటా మొత్తం చోరీ చేస్తున్నారు. దీంతో అటు ఆర్థికంగా, మానసికంగా నష్టం జరుగుతుంది.

Read Also: Moongdal pakoda : పెసరపప్పుతో ఎప్పుడైనా పకోడీలను ట్రై చేశారా? ఒక్కసారి టేస్ట్ చేస్తే అస్సలు వదలరు సుమీ..

ఇదే క్రమంలో ఇప్పుడు ఓ యాప్ ద్వారా మాల్ వేర్ మన ఫోన్లలోకి ప్రవేశిస్తుంది. అది అందరికీ తెలిసిన యాపే. దాని పేరు ఐ రికార్డర్(iRecorder – Screen Recorder). ప్రముఖ ఆండ్రాయిడ్ స్క్రీన్ రికార్డింగ్ యాప్ ఇది. దీని ద్వారా మాల్ వేర్ ఫోన్లలోకి చొరబడినట్లు సైబర్ సెక్యూరిటీ ఫిర్మ్ ఈసెట్(ESET) ప్రకటించింది. ఇది వినియోగదారులపై అనధికారికంగా నిఘా పెట్టినట్లు పేర్కొంది. అంతేకాకుండా సెన్సిటివ్ డేటాను దొంగిలిస్తున్నట్లు వివరించింది.

Read Also: Rujira Banerjee: దుబాయికి వెళ్లకుండా రుజిరా బెనర్జీని అడ్డుకున్న ఇమ్మిగ్రేషన్‌ అధికారులు

ఈ ఐరికార్డర్ మొదట లాంచ్ చేసినప్పుడు ఎటువంటి మాల్ వేర్ లేదని.. కానీ తర్వాత అహ్రాత్(‘AhRat’)అనే మాల్ వేర్ ఓ అప్ డేట్ ద్వారా దానిలో ప్రవేశించినట్లు ఈసెట్ సెక్యూరిటీ రిసెర్చర్ లుకాస్ స్టెఫాన్కో తెలిపారు. దీనివల్లే వినియోగదారుల డేటాను చోరీ చేస్తుందన్నారు. అలాగే స్క్రీన్ రికార్డింగ్స్, డ్యాక్యుమెంట్స్, వెబ్ పేజెస్, మీడియా ఫైల్స్ అన్నీ యాక్సెస్ చేస్తుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఐరికార్డర్ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించారు. అయితే ఇప్పటికే డౌన్ లోడ్ చేసుకున్న వినియోగదారుల డేటా మాత్రం ప్రమాదంలో పడే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఒకవేళ ఇప్పటికీ మీ ఫోన్లో ఈ యాప్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి.

Exit mobile version