NTV Telugu Site icon

Ram Mandir: సైబర్ ఎటాక్ కి ఛాన్స్ ఉందని హోం శాఖ హెచ్చరిక.. అయోధ్యకు నిపుణుల బృందం

Ayodhya

Ayodhya

Ayodhya Ram Mandir To Deal With The Cyber Threats: జనవరి 22న అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామ మందిరంలో శ్రీరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. అందుకు ముందుగానే అన్ని రకాల సన్నాహాలు చేస్తున్నారు. ఇదే అదునుగా సైబర్ కేటుగాళ్లు గత కొన్ని రోజులుగా రామమందిరం పేరుతో ప్రజలకు అనేక రకాల ఫేక్ మెసేజ్ లు పంపి వారి నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. సైబర్ కేటుగాళ్లు కూడా రామమందిరం ప్రాణ ప్రతిష్ట వేడుకలను సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రస్తుతం అయోధ్య రామాలయం పేరు మీద విరాళాలు, ప్రసాదం, వీఐపీ పాస్‌లు ఇలా అనేక రకాల మోసాలు జరుగుతున్నాయి. జనవరి 22న అయోధ్యలో ప్రవేశించేందుకు వీఐపీ పాస్‌లు వాట్సాప్‌లో పంపబడుతున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ పాస్‌లను అడ్మినిస్ట్రేషన్ పంపడం లేదు, సైబర్ దుండగులు పంపుతున్నారు.

Raja Saab: రాజా సాబ్ టీజర్.. ఏంటి మారుతీ బ్రో.. ఫ్యాన్స్ ను అంత మాట అనేశావ్..?

వాట్సాప్‌లో పంపబడుతున్న సందేశం ప్రకారం జనవరి 22న రామమందిర ప్రారంభోత్సవానికి మీరు VIP పాస్‌ను పొందుతున్నారు; అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయడం ద్వారా VIP పాస్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.” అంటూ పేర్కొంటున్నారు. పొరపాటున నిజమే అని ఆ యాప్ డౌన్ లోడ్ చేస్తే ఫోన్ మొత్తం హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది. ఇక ప్రసాదం కోసం ప్రజల నుంచి డబ్బులు తీసుకుంటున్న వెబ్‌సైట్‌ల గురించి సమాచారం ఉంది. ఇక చాలా సైట్‌లు వీఐపీ పాస్‌లు ఇస్తామని కూడా చెబుతున్నాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని, రామ మందిర ప్రారంభోత్సవానికి ముందు సైబర్ బెదిరింపులను ఎదుర్కోవటానికి హోం మంత్రిత్వ శాఖ ఒక ఉన్నత స్థాయి సైబర్ నిపుణుల బృందాన్ని అయోధ్యకు పంపింది. ఈ బృందంలో హోం మంత్రిత్వ శాఖకి చేయండిన I4C సభ్యులు, Meity అధికారులు, IB, CERT-IN అధికారులు అలాగే సైబర్ విషయాలలో నిపుణులైన వారు కూడా ఉన్నారు.

Show comments