Site icon NTV Telugu

ChatGPT : చాట్‌జీపీటీ-5 తో మాట్లాడగలరా? వినగలరా?.. ఇది ఇక సాధ్యమే.!

Chatgpt

Chatgpt

ChatGPT :ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఓపెన్‌ఏఐ తాజాగా తీసుకొచ్చిన కొత్త సంచలనం GPT-5. ఇది చాట్‌బాట్‌లలో మరో మెరుగైన మైలురాయిగా నిలుస్తోంది. GPT-4కు తర్వాతి వెర్షన్‌గా వచ్చిన GPT-5 ఇప్పుడు మరింత శక్తివంతమైన ఫీచర్లతో, వినియోగదారుల అనుభవాన్ని పెంచే విధంగా రూపుదిద్దుకుంది. GPT-5 గురించి ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్ మాట్లాడుతూ, “ఇది రచన, పరిశోధన, విశ్లేషణ, కోడింగ్, సమస్యల పరిష్కారంలో అద్భుతంగా పని చేస్తుంది” అని తెలిపారు. ఈ కొత్త వెర్షన్‌లో వినియోగదారులకు గమనించదగ్గ కొన్ని కీలక మార్పులు కనిపిస్తాయి. అందులో ముఖ్యంగా వాయిస్ మోడ్‌లో వచ్చిన అప్‌గ్రేడ్, చాట్ రంగులను మార్చుకునే అవకాశం, GPT-5 ఎలా ఆలోచించాలి, ఎలా స్పందించాలి అనే అంశాన్ని యూజర్లు కంట్రోల్ చేయగలగడం ప్రధానంగా చెప్పుకోవాలి.

Visakhapatnam Port Authority: విశాఖపట్నం పోర్ట్‌ మరో ఘనత.. భారత్‌లోనే ప్రథమ స్థానం..

రచనల విషయంలో ఇది కథలు, వ్యాసాలు, రిపోర్టులు, స్క్రిప్టులు ఇలా ఏవైనా అవసరాలకుగాను సహజంగా, నాణ్యంగా తయారు చేస్తుంది. అలాగే పరిశోధనలో వాస్తవ సమాచారాన్ని ఆధారంగా చేసుకొని లోతైన విశ్లేషణను ఇస్తుంది. కోడింగ్ విషయానికి వస్తే, ఇది ఇప్పుడు మరింత శక్తివంతంగా ప్రోగ్రామింగ్ చేస్తోంది. కోడ్ రాయడం, బగ్స్‌ను గుర్తించడం, సాల్యూషన్స్ ఇవ్వడం వంటి వాటిలో స్పష్టమైన మెరుగుదల ఉంది. ఇంకా వినియోగదారులు తమ చాట్ ఇంటర్‌ఫేస్‌కు రంగులు ఎంచుకునే ఫీచర్‌ కూడా చేర్చారు. వాయిస్‌ మోడ్‌ ఇప్పుడు మరింత సహజంగా, స్పష్టంగా ఉంటుంది.

అంతేకాదు, యూజర్లు GPT-5 తీరును మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది. అంటే, ఇది తక్కువగా మాట్లాడాలా, నెమ్మదిగా స్పందించాలా, ఎక్కువ సమాచారం ఇవ్వాలా వంటి నిర్ణయాల్ని యూజర్ తీసుకోవచ్చు. ఈ కొత్త వెర్షన్‌తో చాట్‌జీపీటీ ఇప్పుడు మానవ మేధస్సుకు మరింత దగ్గరగా, వ్యక్తిగత సహాయకుడిలా పనిచేసే స్థాయికి చేరింది. సహజమైన భాషతో, మెరుగైన స్పందనతో, వివిధ అవసరాలకు అనుగుణంగా సహాయం చేయగల కొత్త తరం AI టూల్ ఇది.

Ashish Vidyarthi : అలాంటి పాత్రలు ఇస్తేనే సినిమాలు చేస్తా.. ఆశిష్ విద్యార్థి కామెంట్స్

Exit mobile version