Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
- Android vs iPhone చర్చకు ఫుట్‌బాల్ టచ్
- Caviar ప్రత్యేక ఎడిషన్ ఫోన్లను విడుదల
- లియోనెల్ మెస్సీ పేరుతో Samsung Galaxy Z Fold 8 Ultra ప్రత్యేక ఎడిషన్
- క్రిస్టియానో రొనాల్డో పేరుతో iPhone 17 Pro కస్టమ్ ఎడిషన్
- రెండు ఫోన్లలోనూ 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటింగ్, Cloisonné Enamel ఆర్ట్‌వర్క్
- ప్రతి ఫోన్‌ను చేతితో తయారు చేసి కలెక్టర్ ఎడిషన్‌గా
- మెస్సీ ఎడిషన్ 19 యూనిట్లు, రొనాల్డో ఎడిషన్ 19 యూనిట్లు మాత్రమే తయారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Messi vs Ronaldo Luxury Phones: స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో ఎప్పటినుంచో కొనసాగుతున్న Android vs iPhone చర్చకు ఇప్పుడు ఫుట్‌బాల్ రంగు పులిమింది. లగ్జరీ స్మార్ట్‌ఫోన్ కస్టమైజేషన్ బ్రాండ్ కావియర్ (Caviar) ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజాలు లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో పేర్లతో ప్రత్యేక ఎడిషన్ స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. దీంతో టెక్నాలజీ ప్రపంచంలోని అతిపెద్ద రైవర్లి ఫుట్‌బాల్‌లోని GOAT (Greatest of All Time) చర్చతో కలిపి కొత్త ఆకర్షణగా మార్చింది.
మెస్సీకి Samsung.. రొనాల్డోకు iPhone:
కావియర్ నుండి కొత్తగా లెజెండ్స్ కలెక్షన్లో భాగంగా రెండు ప్రత్యేక ఫోన్లను రూపొందించింది. ఇందులో లియోనెల్ మెస్సీ (Lionel Messi) పేరుతో శామ్సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8 అల్ట్రా (Samsung Galaxy Z Fold 8 Ultra), క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) పేరుతో ఐఫోన్ 17 ప్రో (iPhone 17 Pro)ను కస్టమైజ్ చేసింది. ప్రతి ఫోన్ ఆయా ఫుట్‌బాల్ దిగ్గజాల వ్యక్తిత్వం, దేశభక్తిని ప్రతిబింబించేలా ప్రత్యేక డిజైన్‌తో రూపొందించారు.
Also Read
- Oppo K15: ఒప్పో K15 త్వరలో లాంచ్.. Dimensity 7360 ప్రాసెసర్, 8,000mAh బ్యాటరీ
- Infinix Hot 70 Pro: ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రో రిలీజ్.. డ్యూయల్ డిస్ప్లే, 144Hz స్క్రీన్, 6000mAh బ్యాటరీ
- Boss Scam: వాట్సాప్, ఏఐ వాయిస్‌తో మోసం.. 'బాస్ స్కామ్'పై సెబీ హెచ్చరిక..
- Vikram-1: విక్రమ్-1 రాకెట్లో అంతరిక్షంలోకి ప్రధాని మోడీ చేతిరాత పోస్ట్‌కార్డ్.. చరిత్ర సృష్టించనున్న మిషన్ ఆగమన్
24 క్యారెట్ల బంగారంతో ప్రీమియం డిజైన్:
ఈ ప్రత్యేక ఎడిషన్ మొబైల్స్ లో 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటింగ్, క్లోయిజోనే ఎనామెల్ (Cloisonné Enamel) ఆర్ట్‌వర్క్‌ను ఉపయోగించారు. చేతితో తయారు చేసిన ప్రత్యేక డిజైన్ కారణంగా ఇవి కలెక్టర్ ఎడిషన్‌గా నిల్వునుందని కంపెనీ తెలిపింది. ప్రతి ఫోన్‌కు ప్రత్యేక సీరియల్ నంబర్‌తో పాటు ధృవీకరణ పత్రం (Certificate of Authenticity) కూడా అందజేస్తారు. ఈ లిమిటెడ్ ఎడిషన్ సిరీస్‌లో మెస్సీ మోడల్ 19 యూనిట్లు, రొనాల్డో మోడల్ 19 యూనిట్లు మాత్రమే తయారు చేయనున్నారు. ప్రతి ఫోన్ ప్రీమియం బాక్స్‌లో గోల్డ్ ప్లేటెడ్ కీతో అందించబడుతుంది. అంతేకాకుండా.. కొనుగోలుదారులు కోరుకుంటే ప్రత్యేక వ్యక్తిగత కస్టమైజేషన్ సదుపాయాన్ని కూడా కావియర్ అందిస్తోంది.

ధరలు ఎంతంటే?
ఈ లగ్జరీ ఫోన్ల ధరలు తారా స్థాయిలో ఉన్నాయి. క్రిస్టియానో రొనాల్డో ఎడిషన్ ఐఫోన్ 17 ప్రో ప్రారంభ ధర 11,410 డాలర్లు (రూ.9.8 లక్షలు) కాగా, లియోనెల్ మెస్సీ ఎడిషన్ శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8 అల్ట్రా ప్రారంభ ధర 13,130 డాలర్లు (రూ.11.3 లక్షలు)గా ఉంది. స్టోరేజ్ వేరియంట్‌ను బట్టి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.
సాధారణ వినియోగదారుల కంటే లగ్జరీ కలెక్టర్లు, ఫుట్‌బాల్ అభిమానులను లక్ష్యంగా చేసుకుని Caviar ఈ ప్రత్యేక ఎడిషన్‌ను రూపొందించింది. ఫుట్‌బాల్‌లోని మెస్సీ vs రొనాల్డో పోటీని.. టెక్ ప్రపంచంలోని Android vs iPhone చర్చతో మేళవించి ఈ కలెక్షన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
తాజావార్తలు
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Fauji: ఇన్‌స్టాగ్రామ్‌ను షేక్ చేసిన ప్రభాస్.. ‘ఫౌజీ’ ఫస్ట్ లుక్‌తో ఆల్‌టైమ్ రికార్డు!
-
Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
-
Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్‌ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
-
Reverse Gear Bikes: రివర్స్ గేర్ ఉన్న టూ వీలర్స్ ఇవే.. పార్కింగ్, ఇరుకైన రోడ్లలో డ్రైవింగ్ ఇక సులువు!
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్‌తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?