14550mAh భారీ బ్యాటరీ, 12.95 అంగుళాల డిస్‌ప్లేతో Brave Ark 2-in-1 Android డివైజ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇదిగో!

Brave Ark

Brave Ark

Brave Ark 2-in-1 Android Device: భారతీయ టెక్నాలజీ మార్కెట్‌లో కొత్తగా అడుగుపెట్టిన స్వదేశీ స్టార్టప్ బ్రేవ్ (Brave). కంపెనీ నుండి తొలి పర్సనల్ కంప్యూటింగ్ డివైస్ “బ్రేవ్ ఆర్క్ (Brave Ark)” ను అధికారికంగా లాంచ్ చేసింది. డిజిటల్ లెర్నింగ్, కంటెంట్ క్రియేషన్, ప్రొఫెషనల్ వర్క్‌ల మధ్య తరచూ మారుతూ పనిచేసే వినియోగదారులను కంపెనీ “మైండ్ అథ్లెట్స్”గా పేర్కొంటూ ఈ డివైస్‌ను ప్రత్యేకంగా తాయారు చేసింది.

T20 World Cup 2026: ప్రపంచ కప్ ముందు టీమిండియాలో అనూహ్య మార్పు.. జట్టుకు దూరమైన స్టార్ ప్లేయర్!

ఈ డివైస్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత PC మోడ్ తో పనిచేస్తూ.. ఒకే పరికరంలో ప్రొడక్టివిటీ, ఎంటర్టైన్మెంట్, క్రియేటివ్ పనులను సులభంగా నిర్వహించుకునేలా రూపొందించామని కంపెనీ తెలిపింది. ఈ డివైజ్ లో 12.95 అంగుళాల 2.8K (2880×1840 పిక్సెల్స్) LCD డిస్‌ప్లే ఉంది. దీని పనితీరుకు స్నాప్ డ్రాగన్ 8s జెన్ 3 మొబైల్ ప్లాట్‌ఫారమ్ తో పాటు 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ ఇవ్వబడింది.

ఫోటోగ్రఫీ కోసం 13MP రియర్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఆడియో అనుభవం కోసం 8 స్పీకర్లు, DTS ఆడియో సపోర్ట్, డ్యూయల్ మైక్స్ అందించారు. డివైస్‌కు 14550mAh భారీ బ్యాటరీ ఉండి 33W ఫాస్ట్ చార్జింగ్‌తో రెండు రోజుల బ్యాకప్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఇది ఒక్కసారి చార్జ్ చేస్తే 20 గంటల వరకు ఉపయోగించవచ్చు. 7.6 మిమీ సన్నని మెటల్ యూనిబాడీ డిజైన్ దీని ప్రత్యేక ఆకర్షణ.

Chandrahas Controversy: ఇదేమి ‘యాటిట్యూడ్’ చంద్రహాస్.. మస్త్ ఉందిలే!

గలసిటిక్ బ్లూ రంగులో లభించే ఈ డివైజ్ 12GB + 256GB వేరియంట్ ధర రూ. 34,999గా నిర్ణయించారు. ఈ డివైస్ ప్రస్తుతం అమెజాన్ లో అందుబాటులో ఉంది. లాంచ్ ఆఫర్‌గా మొదటి 200 కొనుగోలుదారులకు బ్యాక్‌ లిట్ కీస్, ప్రీమియం లెదర్ టచ్‌తో కూడిన బ్రేవ్ కీబోర్డు ఉచితంగా అందిస్తున్నారు. ఈ కీబోర్డ్ మాగ్నెటిక్‌గా కనెక్ట్ అయి చార్జ్ అయ్యే సౌకర్యం కూడా కలిగి ఉంటుంది.