Site icon NTV Telugu

Boat Ultima Prime, Ember Smartwatches: ప్రీమియం లుక్‌తో.. మార్కెట్‌లోకి బోట్ కొత్త వాచ్‌లు.. ధర తక్కువే!

Smart Watch

Smart Watch

స్మార్ట్‌వాచ్‌లు ఫిట్‌నెస్ ట్రాకింగ్, నోటిఫికేషన్లు, హెల్త్ మానిటరింగ్ వంటి ఎన్నో అధునాతన ఫీచర్లతో అందుబాటులోకి వస్తున్నాయి. స్మార్ట్ వాచ్ లు ట్రెండీగా మారాయి. లుక్ కోసం కూడా ఏజ్ తో సంబంధం లేకుండా స్మార్ట్ వాచ్ లను యూజ్ చేస్తున్నారు. తాజాగా స్మార్ట్ వాచ్ లవర్స్ కు మరో రెండు కొత్త స్మార్ట్ వాచ్ లు అందుబాటులోకి వచ్చాయి. టెక్ బ్రాండ్ బోట్ కంపెనీ అల్టిమా ప్రైమ్, అల్టిమా ఎంబర్ స్మార్ట్‌వాచ్‌లను విడుదల చేసింది. ప్రీమియం లుక్ తో తెగు ఆకట్టుకుంటున్నాయి. Boat కంపెనీ బెస్ట్ బడ్జెట్ స్మార్ట్‌వాచ్‌లను అందిస్తున్న టాప్ బ్రాండ్‌గా నిలిచింది.

Also Read:Shivaraj Yogi : కోటి రుద్రాక్ష ప్రసాదం.. మహదేవ్‌ శక్తి సంస్థాన్‌

బోట్ అల్టిమా ప్రైమ్, అల్టిమా ఎంబర్ ధర

బోట్ అల్టిమా ప్రైమ్, అల్టిమా ఎంబర్ స్మార్ట్‌వాచ్‌లు రెండూ భారత్ లో రూ.2,199 ధరకు అందుబాటులో ఉన్నాయి. బోట్ వెబ్‌సైట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయొచ్చు. ఈ స్మార్ట్‌వాచ్‌లు రాయల్ బెర్రీ, రోజ్ గోల్డ్, స్టీల్ బ్లాక్, సిల్వర్ మిస్ట్ కలర్ ఆప్షన్‌లలో లభించనున్నాయి. బోట్ అల్టిమా ప్రైమ్ అదనపు ఫారెస్ట్ గ్రీన్, ఒనిక్స్ బ్లాక్ షేడ్స్‌లో కూడా అందుబాటులో ఉంది. బోట్ అల్టిమా ఎంబర్ బోల్డ్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లో కూడా అందుబాటులో ఉంది.

Also Read:Mother: చేతులెలా వచ్చాయి తల్లీ.. భర్తతో గొడవపడి ముగ్గురు పిల్లల హత్య..

బోట్ అల్టిమా ప్రైమ్, అల్టిమా ఎంబర్ స్పెసిఫికేషన్లు

బోట్ అల్టిమా ప్రైమ్ 1.43-అంగుళాల AMOLED స్క్రీన్‌ను 466×466 పిక్సెల్స్ రిజల్యూషన్, 700 నిట్స్ బ్రైట్‌నెస్, ఎల్లప్పుడూ ఆన్‌లో ఉండే డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది వేక్ గెశ్చర్ ఫీచర్‌కు సపోర్ట్ చేస్తుంది. బోట్ అల్టిమా ఎంబర్ 368×448 పిక్సెల్ రిజల్యూషన్, 800 నిట్స్ బ్రైట్‌నెస్ స్థాయితో 1.96-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. బోట్ అల్టిమా ప్రైమ్, అల్టిమా ఎంబర్ వాచ్‌లు రెండూ బ్లూటూత్ కాలింగ్‌ తో వస్తున్నాయి. 20 కాంటాక్ట్‌ల వరకు స్టోర్ చేయగల డయల్ ప్యాడ్‌ను కలిగి ఉంటాయి. 100 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌లను కలిగి ఉన్నాయి.

Also Read:Kedar Selagamsetty: షాకింగ్: అల్లు అర్జున్ సన్నిహిత నిర్మాత మృతి?

వీటిలో హృదయ స్పందన రేటు, SpO2, నిద్ర, ఒత్తిడి వంటి హెల్త్ ట్రాకర్లను కలిగి ఉన్నాయి. అల్టిమా ప్రైమ్, అల్టిమా ఎంబర్ స్మార్ట్‌వాచ్‌లు బ్లూటూత్ కాలింగ్‌కు సపోర్ట్ చేస్తాయి. ఇన్ బిల్ట్ మైక్, స్పీకర్స్ ను కలిగి ఉన్నాయి. ప్రైమ్ వెర్షన్ ఐదు రోజుల బ్యాటరీ లైఫ్ ను, ఎంబర్ వేరియంట్ 15 రోజుల బ్యాటరీ లైఫ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. దుమ్ము, నీటి నిరోధకత కోసం IP68-రేటెడ్ ఫీచర్ ను కలిగి ఉన్నాయి. బోట్ అల్టిమా ప్రైమ్, అల్టిమా ఎంబర్ రెండూ 300mAh బ్యాటరీని కలిగి ఉన్నాయి.

Exit mobile version