Site icon NTV Telugu

AMOLED డిస్‌ప్లే, బ్లూటూత్ కాలింగ్‌, 5 రోజులు బ్యాటరీ బ్యాకప్తో Boat Chrome Iris లాంచ్

Boat

Boat

Boat Chrome Iris: వేరబుల్స్ విభాగంలో తన పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరిస్తూ Boat భారత మార్కెట్‌లో కొత్త స్మార్ట్‌వాచ్‌ను రిలీజ్ చేసింది. Boat Chrome Iris పేరుతో లాంచ్ అయిన ఈ మోడల్ అల్ట్రా-స్లిమ్ మెటల్ బాడీతో పాటు ఆకర్షణీయమైన AMOLED డిస్‌ప్లేను అందిస్తోంది. తేలికపాటి డిజైన్‌తో పాటు ఆరోగ్య పర్యవేక్షణ, ఫిట్‌నెస్ ట్రాకింగ్, డైలీ యూజ్‌కు అవసరమైన అనేక స్మార్ట్ ఫీచర్లను ఇందులో పొందుపరిచింది. ఈ స్మార్ట్‌వాచ్‌లో ఫీమేల్ వెల్‌నెస్ ట్రాకింగ్, బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్, ఇతర యుటిలిటీ టూల్స్ ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఐదు రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది.

Read Also: POVA Curve 2 5G: 8000mAh బ్యాటరీ, ట్రిపుల్ కెమెరా సెటప్.. బడ్జెట్ తక్కువ, ఫీచర్స్ ఎక్కువ!

ధర:
భారత మార్కెట్‌లో Boat Chrome Iris స్మార్ట్‌వాచ్ ధర రూ. 3,499గా నిర్ణయించారు. ఈ వాచ్‌ను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, Boat ఇండియా అధికారిక వెబ్‌సైట్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు.

కలర్లు:
* మెటల్ గోల్డ్
* రోజ్ పింక్
* వెల్వెట్ వైన్
* సిల్క్ స్కిన్
* ఫ్రాస్టెడ్ స్కై కలర్ ఆప్షన్లు

స్పెసిఫికేషన్స్:
1.32 ఇంచుల AMOLED డిస్‌ప్లే
* 466 × 466 పిక్సెల్ రిజల్యూషన్
* ఆల్వేస్-ఆన్ డిస్‌ప్లే సపోర్ట్
* 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్

Read Also: Sergio Gor-Piyush Goyal: సుంకాలు జీరో చేసుంటే క్రికెట్ మ్యాచ్ అమెరికానే గెలిచేది.. విందులో గోయల్ నవ్వులు.. పువ్వులు

వెల్‌నెస్ ఫీచర్లు:
* నిరంతర హార్ట్ రేట్ మానిటరింగ్
* SpO2 ట్రాకింగ్
* స్లీప్ ట్రాకింగ్
* గైడెడ్ బ్రితింగ్ మోడ్స్
* స్టెప్స్, క్యాలరీలు వంటి డైలీ యాక్టివిటీ ట్రాకింగ్
* మహిళల కోసం మెన్స్ట్రువల్ సైకిల్ ట్రాకింగ్
* ఫిట్‌నెస్ ఆసక్తి ఉన్నవారికి అనేక స్పోర్ట్స్ మోడ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

బ్యాటరీ:
* 180mAh బ్యాటరీ
* పవర్ సేవింగ్ మోడ్
* క్లౌడ్ బేస్డ్ వాచ్ ఫేసెస్
* కస్టమైజ్ చేయగల మెను లేఅవుట్స్
* 2.5D యూజర్ ఇంటర్‌ఫేస్

కెమెరా:
* కాలిక్యులేటర్
* గేమ్స్
* వాతావరణ సమాచారం
* స్టాప్‌వాచ్, అలారం, టైమర్ వంటి ఫీచర్లతో పాటు బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ కూడా ఉంది.

డిజైన్:
* ఈ స్మార్ట్‌వాచ్‌కు IP68 రేటింగ్ ఉండటం వల్ల ధూళి, నీటికి మంచి రక్షణ లభిస్తుంది. కేవలం 8mm స్లిమ్ ప్రొఫైల్తో ఇది స్టైలిష్ లుక్‌ను అందిస్తుంది.

Exit mobile version