Site icon NTV Telugu

DSLR లాంటి ఫోటోగ్రఫీ ఇచ్చే టాప్ 200MP Camera స్మార్ట్‌ఫోన్లు ఇవే!

200mp Smartphones

200mp Smartphones

200MP Camera Smartphones: కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసే ముందు అనేక విషయాలను పరిగణలోకి తీసుకొని కొనుగోలు చేస్తుంటాము. ఇందులో ప్రస్తుతం కొందరు కెమెరాల ఫీచర్స్ ను ఎంచుకొని మరి కొనుగోలు చేస్తున్నారు. దీనితో స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో ఓ కొత్త పోటీ ఇప్పుడు తారా స్థాయికి చేరింది. ఒకప్పుడు ప్రొఫెషనల్ కెమెరాలకు మాత్రమే పరిమితమైన హై రిజల్యూషన్ ఫోటోగ్రఫీ, ఇప్పుడు 200MP కెమెరాలతో స్మార్ట్‌ఫోన్లలోనే అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా ప్రీమియం ఫోన్ లో లభించే మంచి కెమెరా.. ఇప్పుడు మిడ్-రేంజ్ ధరలోనే అనేక బ్రాండ్లు 200MP సెన్సార్‌లతో ఫోన్లను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. మీరు మీరు కూడా కొత్తగా కెమెరా ఫోకస్ ఉన్న స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటే ఈ ఫోన్లను తప్పక లిస్ట్ లో చేర్చుకోండి.

రెడ్ మీ నోట్ 15 ప్రో 5G (Redmi Note 15 Pro 5G):
బడ్జెట్‌ లో బెస్ట్ 200MP కెమెరా ఫోన్ కావాలంటే ఇది మంచి ఎంపిక. ఈ ఫోన్‌లో OIS సపోర్ట్‌తో కూడిన 200MP మెయిన్ కెమెరా ఉంది. అంతేకాకుండా 8MP అల్ట్రా వైడ్ లెన్స్ కూడా ఇది లభిస్తుంది. ఇది 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ ఉండటం మరో విశేషం. ముందు వైపు 20MP ఫ్రంట్ కెమెరా డైలీ యూజ్, సోషల్ మీడియా కోసం సరిపోయేలా ఉంది. భారత మార్కెట్లో దీని ధర సుమారు రూ.30,000 వద్ద ఉంది.

Biker Glimpse: అదిరిపోయిన శర్వానంద్ ‘బైకర్’ గ్లింప్స్.. ‘బుల్లెట్ సునీల్’గా రాజశేఖర్ మాస్ ఎంట్రీ..

Vivo V60e (vivo V60e):
తక్కువ ధరలో వివో బ్రాండ్ నుంచి 200MP కెమెరా ఫోన్ కావాలనుకునే వారికి వివో V60e మంచి ఆప్షన్. ఇందులో OIS సపోర్ట్‌తో 200MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ లెన్స్ ఉన్నాయి. AI ఆధారిత ఇమేజ్ ఫీచర్లు, 30x సూపర్ జూమ్, మెరుగైన 4K వీడియో అవుట్‌పుట్‌ను కంపెనీ అందిస్తోంది. ముందు వైపు 50MP ఐ ఆటోఫోకస్ ఫ్రంట్ కెమెరా సెల్ఫీలు, వ్లాగింగ్‌కు చాలా ఉపయోగపడుతుంది. ఈ మొబైల్ 256GB వేరియంట్ ధర రూ.33,999గా ఉంది.

వివో X300 (Vivo X300):
ప్రీమియం కెమెరా అనుభవం కావాలంటే వివో X300 ఓ బెస్ట్ ఎంపిక. ఎందుకంటే ఇది ZEISS ఆప్టిక్స్‌తో కూడిన 200MP మెయిన్ కెమెరా, OIS సపోర్ట్ ఇందులో ఉన్నాయి. దీనితో పాటు 50MP పెరిస్కోప్ టెలిఫోటో, 50MP అల్ట్రా వైడ్ లెన్స్‌లు ఇచ్చారు. లేజర్ ఆటోఫోకస్, 4K వీడియో రికార్డింగ్ ఫీచర్లు దీనిని ఆల్‌రౌండ్ కెమెరా ఫోన్‌గా నిలబెడతాయి. ఇంకా 50MP ఫ్రంట్ కెమెరా హై డీటెయిల్ సెల్ఫీలు, వీడియో కాల్స్‌కు బాగా ఉపయోగపడుతుంది. అయితే దీని ధర రూ.75,999. ఇది కాస్త ఎక్కువగానే ఉంటుంది.

శాంసంగ్ గాలక్సీ S25 అల్ట్రా (Samsung Galaxy S25 Ultra):
ప్రీమియం సెగ్మెంట్‌లో కెమెరా పవర్‌హౌస్‌ గా గుర్తింపు పొందిన స్మార్ట్ ఫోన్ శాంసంగ్ గాలక్సీ S25 అల్ట్రా. ఇందులో OIS‌తో కూడిన 200MP మెయిన్ సెన్సార్ ఉంది. దీన్ని 50MP అల్ట్రా వైడ్ కెమెరా, రెండు టెలిఫోటో లెన్స్‌లు సపోర్ట్ చేస్తాయి. 3x, 5x ఆప్టికల్ జూమ్‌తో దూరంలోని ఆబ్జెక్ట్స్‌ను కూడా క్లియర్‌గా క్యాప్చర్ చేయవచ్చు. 8K వీడియో రికార్డింగ్, అడ్వాన్స్‌డ్ స్టెబిలైజేషన్ వల్ల కంటెంట్ క్రియేటర్లకు ఇది బెస్ట్ ఆప్షన్. ముందు వైపు 12MP కెమెరా మాత్రమే ఉంది. భారత మార్కెట్లో దీని ధర సుమారు రూ.1,29,999.

Peanut Rice Recipe: పిల్లల లంచ్ బాక్స్ టెన్షన్‌కు బెస్ట్ సొల్యూషన్.. 10 నిమిషాల్లో రెడీ అయ్యే టేస్టీ, హెల్తీ పల్లీ అన్నం!

రియల్ మీ 16 ప్రో 5G (Realme 16 Pro 5G):
మిడ్ రేంజ్‌లో పవర్‌ఫుల్ కెమెరా ఫోన్ కావాలంటే రియల్ మీ 16 ప్రో 5G కూడా ఓ మంచి ఎంపిక. ఇందులో OIS సపోర్ట్‌తో 200MP మెయిన్ కెమెరా లభిస్తుంది. ఇంకా 50MP ఫ్రంట్ కెమెరా వల్ల హై డీటెయిల్ సెల్ఫీలు తీసుకోవచ్చు. ఇందులో 6.78 ఇంచ్ 144Hz 1.5K AMOLED డిస్ప్లే, డిమెంసిటీ 7300-మాక్స్ చిప్‌సెట్, 7000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్ వంటి ఫీచర్లు దీనిని పవర్ యూజర్లకు ప్రత్యేకంగా నిలబెడతాయి. దీని ధర రూ.31,999 గా ఉంది.

Exit mobile version