Best Budget Phones: 2026లో తక్కువ బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి మార్కెట్లో అనేక ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి. పెద్ద బ్యాటరీ, శక్తివంతమైన ప్రాసెసర్, స్మూత్ డిస్‌ప్లే, మెరుగైన కెమెరా ఫీచర్లతో వివో, రెడ్‌మీ వంటి బ్రాండ్లు రూ.15,000 లోపు ఆకట్టుకునే స్మార్ట్‌ఫోన్లను విడుదల చేశాయి. క్యాజువల్ గేమింగ్ అయినా, మంచి ఫోటోగ్రఫీ అయినా.. ఈ ధరలో ఇప్పుడు అద్భుతమైన ఫోన్లు లభిస్తున్నాయి.
రెడ్‌మీ 15C 5G – ధర: రూ.12,499
రెడ్‌మీ 15C 5G బడ్జెట్ ధరలోనే మంచి పని తీరు అందించే ఫోన్‌గా నిలుస్తోంది.
* డిస్‌ప్లే: 6.9 అంగుళాల HD+ స్క్రీన్ (720×1600 పిక్సెల్స్), 120Hz రిఫ్రెష్ రేట్
* ప్రాసెసర్: MediaTek Dimensity 6300
* బ్యాటరీ: 6,000mAh భారీ బ్యాటరీ
* చార్జింగ్: 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
* గేమింగ్, వీడియో స్ట్రీమింగ్, డేలీ యూజ్ కోసం ఇది మంచి ఆప్షన్‌గా చెప్పవచ్చు.
Read Also: Gold Rates: గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన సిల్వర్, బంగారం ధరలు
Vivo T4x 5G – ధర: రూ.14,999 (బ్యాంక్ ఆఫర్లతో)
* పవర్‌ఫుల్ ప్రాసెసర్, పెద్ద బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ కావాలనుకునే వారికి Vivo T4x 5G బెస్ట్ ఛాయిస్.
* బ్యాటరీ: 6,500mAh, 44W ఫాస్ట్ ఛార్జింగ్ (30 నిమిషాల్లో 40% వరకు ఛార్జ్)
* కెమెరా: 50MP ప్రధాన కెమెరాతో డ్యూయల్ రియర్ సెటప్
* Aura Light: లో-లైట్ ఫోటోగ్రఫీకి సహాయం
* ప్రాసెసర్: MediaTek Dimensity 7300
* డిస్‌ప్లే: Full HD+ (2408×1080 పిక్సెల్స్), 120Hz రిఫ్రెష్ రేట్
* రక్షణ: IP64 డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్
ఏ ఫోన్ మీకు సరిపోతుంది?
క్యాజువల్ గేమింగ్ & పెద్ద బ్యాటరీ కావాలంటే – Redmi 15C 5G తీసుకోవచ్చు.. కెమెరా, ఫాస్ట్ ఛార్జింగ్ & పవర్‌ఫుల్ పని తీరు కోరుకుంటే- Vivo T4x 5G ఎంపిక చేసుకోవచ్చు. ఇక, 2026లో బడ్జెట్ సెగ్మెంట్‌లో ఈ ఫోన్లు మంచి ఫీచర్లు అందిస్తున్నాయి. మీ అవసరాలను బట్టి సరైన ఫోన్ ఎంచుకుని స్మార్ట్‌గా అప్‌గ్రేడ్ అవ్వొచ్చు.
