కేవలం 6.5 మిమీ మందం, 12.2 అంగుళాల 2.8K OLED డిస్‌ప్లే, Dimensity 8300 చిప్‌తో ASUS Pad (T3201) భారత్‌లో లాంచ్..!

Asus Pad (t3201)

Asus Pad (t3201)

ASUS Pad (T3201): ఆసుస్ (ASUS) భారత్‌లో కొత్తగా ASUS Pad (T3201) ట్యాబ్లెట్‌ను అధికారికంగా విడుదల చేసింది. మల్టీమీడియా ఎంటర్‌టైన్మెంట్, ప్రొడక్టివిటీ, క్రియేటివ్ వర్క్‌ఫ్లోలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ ట్యాబ్లెట్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తోంది.

స్లిమ్ డిజైన్:

ASUS Pad (T3201) కేవలం 6.5 మిమీ మందం మాత్రమే కలిగి ఉంది. ఫైబర్‌గ్లాస్ రియర్ ప్యానెల్‌తో రూపొందించిన ఈ ట్యాబ్లెట్ ప్రయాణాలు, ఆఫీస్ పనులు, రిమోట్ వర్క్‌కు అనువుగా ఉంటుంది. కంపెనీ బాక్స్‌లోనే ఒక ప్రొటెక్టివ్ ఫోలియో కేస్ను అందిస్తోంది. ఇది ట్యాబ్లెట్‌ను స్క్రాచ్‌లు, చిన్నపాటి దెబ్బల నుంచి కాపాడటమే కాకుండా నాలుగు రకాల వ్యూయింగ్ యాంగిల్స్‌లో స్టాండ్‌గా కూడా ఉపయోగించుకోవచ్చు.

OLED డిస్‌ప్లే:

ఈ ట్యాబ్లెట్‌లో 12.2 అంగుళాల డ్యూయల్ లేయర్ OLED డిస్‌ప్లే ఉంది. 2800 × 1840 పిక్సెల్స్ 2.8K రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్, 3:2 ఆస్పెక్ట్ రేషియో, 92% స్క్రీన్-టు-బాడీ రేషియోతో అద్భుతమైన విజువల్ అనుభూతిని అందిస్తుంది. అలాగే 100% DCI-P3 కలర్ గామట్ సపోర్ట్‌తో రంగులు మరింత సహజంగా కనిపిస్తాయి. సాధారణంగా 600 నిట్స్ బ్రైట్‌నెస్, HDR కంటెంట్‌లో 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. కళ్లపై ఒత్తిడి తగ్గించే TÜV లో ఫ్లిక్కర్, లో బ్లూ లైట్ సర్టిఫికేషన్లు కూడా ఇందులో ఉన్నాయి.

క్వాడ్ స్పీకర్లు:

ఆడియో కోసం ఈ ట్యాబ్లెట్‌లో క్వాడ్ స్పీకర్ సెటప్ ను ASUS అందించింది. డాల్బీ ఆటమ్స్ 360° సినిమాటిక్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్‌తో సినిమాలు, మ్యూజిక్, గేమింగ్ సమయంలో అద్భుతమైన సౌండ్ అనుభూతిని అందిస్తుంది.

పవర్‌ఫుల్ ప్రాసెసర్‌:

ASUS Pad (T3201)లో 4nm ఆధారిత MediaTek Dimensity 8300 ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఉంది. ఇది గరిష్టంగా 3.35GHz క్లాక్ స్పీడ్తో పనిచేస్తుంది. 8GB LPDDR5X RAMతో పాటు 128GB, 256GB UFS 3.1 స్టోరేజ్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అవసరమైతే microSD కార్డ్ ద్వారా 1TB వరకు స్టోరేజ్‌ను విస్తరించుకోవచ్చు.

బ్యాటరీ & ఛార్జింగ్:

ఈ కొత్త ట్యాబ్లెట్‌లో 9,000mAh బ్యాటరీను అందించారు. దీనికి 45W USB-C ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఛార్జర్‌తో 30 నిమిషాల్లో 0 నుంచి 50% వరకు ఛార్జ్ అవుతుంది. ఈ ట్యాబ్లెట్ Android 16పై పనిచేస్తుంది. ఇందులో Google Circle to Search ఫీచర్ ఉండటంతో స్క్రీన్‌పై కనిపించే ఏ అంశంపైనా వెంటనే సెర్చ్ చేయవచ్చు. ASUS Pen 2.0 స్టైలస్, బ్లూ టూత్ కీబోర్డ్స్ కు సపోర్ట్ ఉండటంతో నోట్స్ రాయడం, స్కెచింగ్ చేయడం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.

కెమెరా:

ఫోటోగ్రఫీ కోసం 13MP రియర్ కెమెరాతో పాటు LED ఫ్లాష్ ను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5MP ఫ్రంట్ కెమెరా ఉంది. కనెక్టివిటీ పరంగా Wi-Fi 6E, బ్లూటూత్ 5.3, USB Type-C పోర్ట్, డాల్బీ ఆటమ్స్ సపోర్ట్ వంటి ఆధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ధర:

భారత్‌లో ASUS Pad (T3201) 8GB + 128GB వేరియంట్ ధర రూ.45,990, 8GB + 256GB వేరియంట్ ధర రూ.49,990గా నిర్ణయించారు. ఈ ట్యాబ్లెట్ ఆగస్టు 6 నుంచి ఫ్లిప్కార్ట్, ASUS eShop, ASUS & ROG స్టోర్లు, Reliance Digitalతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అధీకృత ASUS రిటైల్ స్టోర్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. అలాగే వినియోగదారులు ASUS Easy Pay ద్వారా 12 నెలల వరకు నో-కాస్ట్ EMI సదుపాయాన్ని కూడా పొందవచ్చు. ప్రారంభ EMI నెలకు రూ.3,833 నుంచి ప్రారంభమవుతుంది.