స్మార్ట్ వాచ్ లు ఎంతగా ఉపయోగ పడుతున్నాయో నిత్యం వార్తల్లో చూస్తూనే ఉన్నాం.. తాజాగా మరోసారి ఓ ప్రముఖ కంపెనీ వాచ్ ఇప్పుడు ట్రేండింగ్ ఉంది.. యాపిల్ స్మార్ట్ వాచ్ లకు మార్కెట్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. అనేక రకాల హెల్త్, ఫిట్‌నెట్ ట్రాకర్లు, ఫీచర్లను కలిగి ఉంటాయి. ఈ కీలక ఫీచర్లు అత్యవసర పరిస్థితుల్లో ఆపిల్ స్మార్ట్‌వాచ్ యూజర్ల ప్రాణాలను కాపాడిన ఘటనలు కూడా అనేకం ఉన్నాయి.. తాజాగా ఇలాంటి ఘటన మరోసారి వార్తల్లో నిలిచింది..
అత్యవసర పరిస్థితుల్లో ఉన్న ఓ వ్యక్తికి వైద్య సహాయం అందించేందుకు డాక్టర్‌కు ఆపిల్ వాచ్ అవసరం అయింది.. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది..బ్రిటన్ నుంచి ఇటలీ వెళ్తున్న విమానంలో 70 సంవత్సరాల మహిళ శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది వైద్య సాయం కోసం ప్రయత్నించారు. అయితే అదే విమానంలో నేషనల్ హెల్త్ సర్వీస్‌కు చెందిన డాక్టర్ కూడా ప్రయాణం చేస్తున్నారు.. ఆపిల్ స్మార్ట్‌వాచ్ అవసరం ఉందని విమాన సిబ్బందికి సూచించారు. ఆపిల్ స్మార్ట్‌వాచ్‌లోని బ్లడ్ ఆక్సిజన్ ఫీచర్ ద్వారా ఆమె రక్తంలోని ఆక్సిజన్ స్థాయిని తెలుసుకొనే ప్రయత్నం చేశారు..
అలా ఊపిరితిత్తుల నుంచి శరీరంలోని ఇతర భాగాలకు తక్కువ శాతం రక్తప్రసరణ జరిగితే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి.. వాచ్ ద్వారా ఆమె స్థితిని పరిశీలించారు.. అంతేకాదు ఆమెకు గతంలో కూడా హెల్త్ ప్రాబ్లంలు ఉన్నాయని గుర్తించారు.. 70 సంవత్సరాల వయస్సు ఉన్న మహిళ ఆరోగ్య స్థితిని తెలుసుకొనేందుకు ఈ స్మార్ట్ వాచ్ సాయ పడిందని చెప్పారు.. మొత్తానికి విమానం ల్యాండ్ అయ్యేవరకు ఆమె ఆరోగ్యం క్షీనించకుండా కాపాడారు.. ఆమె ఆరోగ్యం ఇప్పుడు బాగానే ఉందని సమాచారం..