Site icon NTV Telugu

Apple iPhone: ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఆ ఐఫోన్ పై భారీ డిస్కౌంట్..

Iphone 13 New Green Color

Iphone 13 New Green Color

ప్రముఖ మొబైల్ తయారీదారు యాపిల్ ఎప్పటికప్పుడు సరికొత్త ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తోంది. తాజాగా ఈ కంపెనీ యాపిల్ ఐఫోన్ 13 ని గ్రీన్ కలర్‌ లో లాంచ్ చేసింది. స్ప్రింగ్ ఈవెంట్‌లో భాగంగా ఐఫోన్ ఎస్ఈ 3, ఐపాడ్ ఎయిర్, మ్యాక్ స్టూడియోని పరిచయం చేసింది. ప్రస్తుతం ఐఫోన్ 13 గ్రీన్ కలర్ ఫోన్‌ హాట్ కేకుల్లా సేల్ అవుతోంది. ఐఫోన్ 13 గ్రీన్ కలర్‌ని స్టాక్ అయిపోకముందే మీరు కూడా దీన్ని సొంతం కొనాలని చూస్తున్నారా?..అయితే మీకోసమే తాజాగా యాపిల్ రీసెల్లర్ ఇండియా ఐస్టోర్ అదిరిపోయే ఆఫర్ తీసుకొచ్చింది. మరి ఆ ఆఫర్ ఏంటి, డిస్కౌంట్‌తో ఎలా పొందాలనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

డిస్కౌంట్ వివరాలు..

1. ఇండియా ఐస్టోర్ వెబ్‌సైట్ వెనిలా, పింక్, రెడ్, బ్లూ, గ్రీన్ కలర్స్‌లోని ఐఫోన్ 13పై రూ.5,000 ఇన్‌స్టంట్ స్టోర్ డిస్కౌంట్ అందిస్తోంది. దీనితో ఐఫోన్ 13 ధర రూ.79,900 నుంచి రూ. 74,900కి తగ్గుతుంది.

2. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ యూజర్లు రూ.4,000 వరకు క్యాష్‌బ్యాక్ అందుకోవచ్చు. ఈ ఆఫర్‌తో కలిపి ఐఫోన్ 13ని రూ.70,900కి సొంతం చేసుకోవచ్చు.

3. వీటితోపాటు ఒక ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. యాపిల్ రీసెల్లర్ అందిస్తున్న ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద మీరు మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను విక్రయించి ఐఫోన్ 13 ధరను మరింత తగ్గించుకోవచ్చు.

ఇలా చాలా ఆకర్షణీయమైన ఆఫర్లతో మీరు ఐఫోన్ 13ని రూ. 52,900కే దక్కించుకోవచ్చు. అంటే యాపిల్ ఐఫోన్ 13 పై మీరు ఏకంగా రూ.27 వేల డిస్కౌంట్ పొందొచ్చు. అయితే మీ పాత స్మార్ట్‌ఫోన్ వర్కింగ్ కండిషన్ ఆధారంగా మాత్రమే ఈ ధర అనేది నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి యూజర్లు తమ ఫోన్ గురించి నిజమైన సమాచారాన్ని అందించాలి. అయితే ఈ డిస్కౌంట్ కేవలం గ్రీన్ ఐఫోన్ 13పై మాత్రమే కాదు. ఈ ఆఫర్‌లు వనిల్లా ఐఫోన్ 13 మోడల్‌లోని అన్ని రంగులకు వర్తిస్తాయి.

 

Exit mobile version