NTV Telugu Site icon

Anand Mahindra: సైకిల్‌ లాంటి ఎలక్ట్రిక్‌ బైక్‌.. లోకల్‌ ట్యాలెంట్‌కు ఆనంద్‌ మహీంద్రా ఫిదా..

Anand Mahindra

Anand Mahindra

ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థల ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా.. బిజినెస్‌ కార్యకలాపాల్లో బిజీగా ఉండడమే కాదు.. సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటారు.. ఎప్పటికప్పుడు పలు ఆసక్తికరమైన విషయాలను, ఫొటోలను, వీడియోలను షేర్‌ చేస్తూ.. ఆసక్తికరమైన కామెంట్లు పెడుతుంటారు.. ముఖ్యంగా లోకల్‌ టాలెంట్‌ను వెలికి తీయడంలో ఆయన ముందు వరుసలో ఉంటారు.. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణాల్లో.. సిటీల్లో ఏదైనా కాస్త భిన్నమైంది ఆయనకు ఏదైనా కనిపిస్తే చాలా.. దానిని విడిచిపెట్టకుండా.. షేర్‌ చేసి.. తన అభిప్రాయాలను పంచుకుంటారు.. ఇతరులకు స్ఫూర్తినిచ్చే వాటిని పరిచయం చేస్తుంటారు. కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో.. ఆయనకు ఆయనే సాటి అని చెప్పాలి.

Read Also: ED Raids: అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్‌పై ఈడీ రైడ్స్ .. ఆరోపణలు ఇవే..!

అయితే, ఇప్పుడు మహీంద్రా మరో కొత్త ట్యాలెంట్‌ను సోషల్‌ మీడియాలో నెటిజన్లకు పరిచయం చేశారు.. ఇప్పుడు మొత్తం ఎలక్ట్రిక్‌ బైక్‌లు, కార్లపై ఫోకస్‌ పెరిగడం.. అవి కొనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపుతోన్న నేపథ్యంలో.. ఓ బ్యాటరీ వాహనానికి సంబంధించిన వీడియోను తన ట్విట్టర్‌ హ్యాండిల్‌లో షేర్‌ చేశారు ఆనంద్‌ మహీంద్రా.. గ్రామీణ ప్రాంతాల్లోని రవాణారంగ ఆవిష్కరణలు నన్ను ఎప్పుడూ ఆకట్టుకుంటాయి.. ఇక్కడ అవసరాలే ఆవిష్కరణలకు మూలం అంటూ రాసుకొచ్చారు.. కేవలం చిన్న డిజైన్ ఇన్‌పుట్‌లతో తయారు చేసిన ఈ వాహనం.. గ్లోబల్ అప్లికేషన్‌ను కనుగొనగలదు. రద్దీగా ఉండే యూరోపియన్ పర్యాటక కేంద్రాల్లో టూర్ ‘బస్సు’లా? నేను ఎల్లప్పుడూ గ్రామీణ రవాణా ఆవిష్కరణలతో ఆకట్టుకుంటాను.. ఇక్కడ అవసరం ఆవిష్కరణకు తల్లి.. అని పేర్కొన్నారు.. ఇక, ఆ వీడియోలో ఆ వాహనం తయారు చేయడానికి ఎంత ఖర్చు అయ్యింది.. ఎన్ని కిలోమీటర్ల వరకు నడుస్తుందనే విషయాలను పంచుకున్నాడు ఆ బైక్‌ తయారు చేసిన యువకుడు.. ఆ వాహనాన్ని తయారుచేసేందుకు రూ.12,000 ఖర్చు అయ్యిందని.. ఒక్కసారి ఛార్జింగ్‌ పెడితే 150 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు అని.. సదరు యువకుడు చెప్పుకొచ్చాడు.. అయితే, పొడవాటి సైకిల్‌లా ఉన్న ఆ వాహనం.. పెద్దసైజ్‌ బైక్‌లా కనిపిస్తోంది.. ఒకరి తర్వాత ఒకరు కూర్చేనే విధంగా సీట్లను ఏర్పాటు చేశారు.. మొత్తంగా ఆ వాహనానికి ఆనంద్‌ మహీంద్ర మాత్రమే కాదు.. నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు.

Show comments