NTV Telugu Site icon

SBI Yono App: SBI వినియోగదారులకు అలర్ట్.. ఈ యాప్ పని చేయదు..!

Sbi Yono

Sbi Yono

భారతదేశంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) బ్యాంకు ఖాతాను చాలా మంది వినియోగదారులు వాడుతున్నారు. అయితే ఈ బ్యాంకులో ఖాతా ఉన్నవారికి ఒక ముఖ్య గమనిక.. SBI Yono App మొబైల్ బ్యాంకింగ్ యాప్.. వినియోగదారులకు సౌకర్యవంతమైన సేవలను అందిస్తుంది. అయితే ఇకపై ఒక ముఖ్యమైన మార్పుతో రానుంది. SBI Yono App త్వరలో ఆండ్రాయిడ్ 11 (Android 11), పాత వెర్షన్‌లను ఉపయోగించే స్మార్ట్‌ఫోన్లలో పని చేయదు. దీంతో.. ఈ స్మార్ట్‌ఫోన్‌లపై ఆధారపడిన వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.

భద్రత, పనితీరు మెరుగుదల కోసం ఈ మార్పు చేశారు. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొద్దీ, పాత ఆపరేటింగ్ సిస్టమ్‌లు యూజర్ డేటాను రక్షించడానికి అవసరమైన తాజా భద్రతా నవీకరణలను నిర్వహించలేవు. అందువల్ల.. పాత ఆండ్రాయిడ్ వెర్షన్‌లకు మద్దతును నిలిపివేయడం ద్వారా YONO యాప్ తన వినియోగదారులకు మరింత భద్రత, మెరుగైన అనుభవం అందించాలనుకుంటోంది.

Read Also: Nitish Kumar Reddy: ‘కాటేరమ్మ కొడుకు’గా మారిన నితీశ్ కుమార్ రెడ్డి.. బ్యాట్లనే కత్తులుగా!

పాత ఆండ్రాయిడ్ వెర్షన్లను ఉపయోగించే చాలా మంది వినియోగదారులు YONO యాప్‌ను ఉపయోగించడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వాటిని ప్లే స్టోర్‌లో పంచుకున్న అనేక వినియోగదారుల అభిప్రాయాలు కూడా ఉన్నాయి. “నేను చాలా సంవత్సరాలుగా YONO SBI యాప్‌ను ఉపయోగిస్తున్నాను. తాజా అప్‌డేట్ ఇప్పుడు Android 12 లేదా ఎక్కువ వెర్షన్‌లకు మాత్రమే మద్దతు ఇస్తుంది. నాకు ఆండ్రాయిడ్ 10 ఫోన్ ఉంది. దీంతో.. యాప్‌ను ఉపయోగించలేను” అని ఒక వినియోగదారు తెలిపాడు.

ఆండ్రాయిడ్ 11, పాత వెర్షన్‌లపై నడిచే ఫోన్‌లు:
Samsung Galaxy S21 Ultra 5G
Samsung Galaxy S20 5G
Google Pixel 4
Samsung Galaxy Note 20 Ultra 5G
OnePlus 8 Pro
OnePlus 9 Pro
POCO X3 Pro