AI Videos: ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వ్యూస్ సాధించిన యూట్యూబ్ ఛానల్ భారత్‌కు చెందినది. అది మానవ కల్పిత కంటెంట్‌కు చెందినది కాదు.. ఏఐ జనరేటెడ్ వీడియోలకు చెందిన యూట్యూబ్ ఛానెల్ “బందర్ అప్నా దోస్త్” వీడియో ఎడిటింగ్ ప్లాట్‌ఫామ్ కాప్‌వింగ్ (Kapwing) నిర్వహించిన తాజా అధ్యయనంలో ఈ విషయం బయటపడింది. ఈ అధ్యయనం ప్రకారం.. భారతీయ ప్రేక్షకులు ఏఐ ఆధారిత కంటెంట్‌ను విపరీతంగా వీక్షిస్తున్నారని తేలింది. యూట్యూబ్‌లో ఏఐ వీడియోల పెరుగుదలపై విస్తృత చర్చ కూడా జరుగుతోంది. మానవ కంటెంట్ క్రియేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్కువ శ్రమ, అత్యల్ప ఖర్చుతో తయారవుతున్న ఏఐ స్పామ్ వీడియోలు నాణ్యత, మానవ కంటెంట్‌ను నాశనం చేస్తున్నాయని ఆవేదన చెందుతున్నారు.
READ MORE: Kohli New Record: సచిన్ రికార్డు బ్రేక్ దిశగా విరాట్ కోహ్లీ.. కేవలం 25 పరుగులు దూరంలో
కాప్‌వింగ్ పరిశోధకులు యూట్యూబ్‌లో టాప్ 500 షార్ట్స్ వీడియోలను విశ్లేషించారు. అందులో 21 శాతం (104 వీడియోలు) పూర్తిగా ఏఐతో రూపొందించినవిగా గుర్తించగా, 33 శాతం (165 వీడియోలు) “బ్రెయిన్‌రాట్” కేటగిరీలో ఉన్నాయి. ఈ “బ్రెయిన్‌రాట్” కంటెంట్ సాధారణంగా తక్కువ నాణ్యతతో, ఆకట్టుకునేలా ఉన్నాయి. అంతేకాదు.. ప్రపంచవ్యాప్తంగా పూర్తిగా ఏఐ వీడియోలపైనే ఆధారపడే వందలాది యూట్యూబ్ ఛానళ్లు ఉన్నాయని కాప్‌వింగ్ అధ్యయనం వెల్లడించింది. ఇవన్నీ కలిపి బిలియన్ల వ్యూస్ సాధించడమే కాకుండా, యూట్యూబ్ ఆల్గోరిథమ్‌ను ఎంత సమర్థవంతంగా వినియోగించుకుంటున్నాయో కూడా ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. ఏఐ వీడియోలపై కాప్‌వింగ్ సైతం ఆందోళన వ్యక్తం చేసింది. యూట్యూబ్‌లో ముఖ్యంగా షార్ట్స్ ఫీడ్‌లు, ట్రెండింగ్ విభాగాల్లో “AI స్లాప్” (తక్కువ శ్రమతో ఏఐ ద్వారా తయారై, వ్యూస్ కోసం మాత్రమే రూపొందించిన కంటెంట్) వేగంగా పెరుగుతోందని కాప్‌వింగ్ పేర్కొంది.
READ MORE: Bandar Apna Dost: కోతి “ఏఐ” వీడియోలు.. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వ్యూస్ సాధించిన ఛానెల్‌గా గుర్తింపు!
