Site icon NTV Telugu

ఫ్రేమ్‌లెస్ డిజైన్, 4K విజువల్స్, థియేటర్ లాంటి అనుభూతి అందించే.. Acer 55-inch QLED టీవీపై రూ.49000 భారీ డిస్కౌంట్..!

Acer 55 Inch Qled

Acer 55 Inch Qled

Acer 55-inch QLED TV: కొత్త స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలనుకునే వారికి బంఫర్ ఆఫర్.. కొత్త స్మార్ట్ టీవీ కొనడానికి చూస్తున్న వారికి Acer కంపెనీ అదిరిపోయే గుడ్ న్యూస్ తీసుకవచ్చింది. Acer Ultra V Series కింద విడుదలైన 55 అంగుళాల (139 సెం.మీ) 4K Ultra HD Smart QLED Google TV (మోడల్: AR55QDVGU2875BD)పై భారీ ధర తగ్గింపును అందిస్తోంది. ఫ్రేమ్‌లెస్ డిజైన్, 4K విజువల్స్ వంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Bazball: ఇంగ్లాండ్ ఇక ‘బజ్‌బాల్’కు చరమగీతం.. జట్టులో కీలక మార్పులు..!

ఈ Acer QLED టీవీ ఆధునిక డిజైన్‌తో పాటు అత్యాధునిక ఫీచర్లతో వస్తోంది. ఫ్రేమ్‌లెస్ డిజైన్, 4K (3840×2160 పిక్సెల్స్) రిజల్యూషన్, 60Hz రిఫ్రెష్ రేట్‌తో అద్భుతమైన విజువల్ అనుభవాన్ని అందిస్తుంది. QLED డిస్‌ప్లే, VA ప్యానెల్, 178 డిగ్రీల వైడ్ వ్యూయింగ్ యాంగిల్ కారణంగా ఏ దిశ నుంచి చూసినా క్లియర్ పిక్చర్ క్వాలిటీ కనిపిస్తుంది. ఈ టీవీకి ఆండ్రాయిడ్ 14 ఆధారిత గూగుల్ టీవీ OSను అందించారు.

వీటితోపాటు లేటెస్ట్ AI ఎనేబుల్డ్ 2875 చిప్‌సెట్, మైక్రో డిమ్మింగ్, MEMC, ALLM, DLG వంటి ఫీచర్లతో గేమింగ్ అండ్ స్ట్రీమింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరిచింది. HDR10, HLG సపోర్ట్‌తో పాటు ‘అల్ట్రా బ్రైట్నెస్’ ఫీచర్ ఉండటం వల్ల కలర్స్ మరింత నేచురల్‌గా కనిపిస్తాయి. ఆడియో పరంగా కూడా ఈ టీవీ ఆకట్టుకుంటుంది. ఇందులో 36W పవర్‌తో డాల్బీ ఆడియో సపోర్ట్ చేసే హై ఫిడెలిటీ స్పీకర్లు ఇందులో ఉన్నాయి. దీంతో సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూసేటప్పుడు థియేటర్ లాంటి అనుభూతి లభిస్తుంది.

Shaheen Afridi: ‘కుక్క తోక వంకర’లా పాకిస్థాన్ ప్రీమియం బౌలర్ వ్యాఖ్యలు.. మళ్లీ ఇండియా, పాక్ ఆసియా కప్ వివాదం తెరపైకి..!

కనెక్టివిటీ విషయానికి వస్తే ఇందులో HDMI, USB (2 పోర్టులు), Wi-Fi, ఈథర్నెట్, బ్లూటూత్ 5.2 వరకు సపోర్ట్ ఉంది. వీడియో కాలింగ్, ఐ కేర్ ప్రొటెక్ట్, పర్సనలైజ్డ్ కంటెంట్ సజెషన్స్ వంటి స్మార్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి. దీని అసలు ధర రూ. 78,999 కాగా ఈ టీవీ ఇప్పుడు ఏకంగా రూ.49000 భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 29,999కే లభిస్తుంది. అలాగే ఈ టీవీపై No Cost EMI ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. నెలకు సుమారు రూ. 1,055 నుంచి EMI ప్రారంభమవుతుంది. అలాగే ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై బ్యాంక్ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు కూడా ఉన్నాయి.

Exit mobile version