NTV Telugu Site icon

Fact Check: అవునా? 4 జీ, 3 జీ మొబైల్స్ నిలిచిపోతాయా? నిజమెంత..?

Fact Check

Fact Check

టెలికం మార్కెట్‌లో కొత్త శకం ప్రారంభమైంది.. ఇప్పటికే భారత్‌లో 5జీ సేవలు ప్రాంభంమయ్యాయి.. టెలికం సంస్థలు.. 5జీ సేవలను అందించడంలో నిమగ్నమైపోయాయి.. అయితే.. ఇప్పుడు 4జీ అందుబాటులోకి వచ్చినా.. 3జీ కూడా వాడేవారున్నారు.. కానీ, 5జీ ఎంట్రీతో 3జీ, 4 జీ మొబైళ్ల తయారీ నిలిచిపోతుందనే వార్తలు హల్‌ చల్‌ చేస్తున్నాయి. 3జీ, 4జీ స్మార్ట్‌ఫోన్‌ల ఉత్పత్తిని నిలిపివేయాలని మొబైల్‌ తయారీ సంస్థలకు ప్రభుత్వం సూచనలు జారీ చేసిందని.. ఇక, త్వరలోనే అది అమలు కాబోతోందనేది వాటి సారాశం.. ఇక, కొన్నిసార్లు రియల్‌ ఏది? వైరల్‌ ఏది? అనే విషయాలు పట్టించుకోని సోషల్‌ మీడియాలో అది కాస్త రచ్చగా మారిపోయింది.. అయితే, అందులో నిజం ఎంత? అనే దానిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో క్లారిటీ ఇచ్చింది..

4జీ, 3జీ ఫోన్‌ల తయారీని నిలిపిపేయాలని వివిధ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిందన్న మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోన్న నేపథ్యంలో.. దీనిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) క్లారిటీ ఇచ్చింది.. వైరల్‌గా మారిన ఆ మెసేజ్ అబద్ధమని స్పష్టం చేసింది.. ఫ్యాక్ట్‌చెక్ అకౌంట్ ద్వారా ఈ విషయంపై వివరణ ఇచ్చింది.. 4జీ, 3జీ ఫోన్‌ల ఉత్పత్తిని ఆపేయాలని కంపెనీలకు ప్రభుత్వం సూచించిందన్న మెసేజ్.. ఫేక్ అని తేల్చేసింది. కంపెనీలకు భారత ప్రభుత్వం అలాంటి మార్గదర్శకాలు ఇవ్వలేదని పేర్కొంది. అంటే.. దీని ప్రకారం.. 3జీ, 4జీ మొబైల్‌ ఫోన్ల తయారీ ఆపాలంటూ వైరల్‌ అవుతున్న వైరల్‌ న్యూస్‌కు దీంతో… చెక్‌ పెట్టే ప్రయత్నం చేసింది.

కాగా, భారతి ఎయిర్‌టెల్ మరియు రిలయన్స్ జియో అక్టోబర్ 1 నుండి దేశంలోని కొన్ని నగరాల్లో 5జీ సేవలను అందించడం ప్రారంభించాయి. ఎయిర్‌టెల్.. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, నాగ్‌పూర్ మరియు వారణాసిలలో సేవలను ప్రారంభించింది. అదే సమయంలో, జియో ఢిల్లీ, ముంబై, కోల్‌కతా మరియు వారణాసిలలో సేవలను ప్రారంభించింది. దేశంలోని నగరాల్లో 5జీ సేవ ప్రారంభించబడింది. 5జీ వెబ్ ప్రారంభమైన వెంటనే వారి సమాచారం సెకన్లలో అయిపోతుందని వినియోగదారులు ట్విట్టర్‌లో ఫిర్యాదు చేశారు. అయితే 5జీ వెబ్ యొక్క వేగం 500 నుండి 600 ఎంబీపీఎస్‌ వరకు ఉన్నట్లు పరీక్షలో వెల్లడైంది. జియో తన కస్టమర్లకు లిమిట్‌లెస్ 5జీ వెబ్‌ను అందిస్తోంది. అదే సమయంలో, ఎయిర్‌టెల్ తన కస్టమర్ల మునుపటి ప్లాన్‌లో 5జీ వెబ్ సేవను అందిస్తోంది. అయినప్పటికీ, ప్రతి ప్లాట్‌ఫారమ్‌లు తమ 5జీ ప్లాన్‌లను వెల్లడించలేదు.