మాస్ మహారాజ రవితేజ, దర్శకుడు కిషోర్ తిరుమల కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఈ సంక్రాంతికి థియేటర్లలో సందడి చేస్తోంది. పండుగ రేసులో భారీ పోటీ ఉన్నప్పటికీ, తన పాత వింటేజ్ కామెడీ టైమింగ్‌తో రవితేజ మరోసారి తనదైన మార్క్ చూపించి ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఆషిక రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం అదనపు ఆకర్షణగా నిలిచింది. వరుస సినిమాల తర్వాత సరైన…