కలకుంట్ల మదన్ మోహన్‌రావు. తెలంగాణ కాంగ్రెస్ ఐటీ విభాగం ఇంఛార్జ్. గత లోక్‌సభ ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. కొంతకాలంగా మదన్ మోహన్ తీరు పార్టీలో తీవ్ర గందరగోళానికి దారితీస్తోంది. కాంగ్రెస్ సీనియర్లను కాదని.. కార్యకర్తల ప్రమేయం లేకుండా కామారెడ్డి జిల్లాలో ఆయన వ్యవహరిస్తున్న తీరు పార్టీలు సెగలు రేపుతోంది. ఈ దఫా ఆయన ఎంపీగా కాకుండా అసెంబ్లీకి పోటీ చేయాలని చూస్తున్నారు. ఆ క్రమంలోనే కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడలపై ఆయన కన్నేసినట్టు టాక్.…