వైఎస్ రాజశేఖరరెడ్డి 73వ జయంతి, వైఎస్సార్‌టీపీ తొలి వార్షికోత్సవం సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సంవత్సర కాలంలో తమ పార్టీ ఎంతో పురోగతి సాధించిందని.. తెలంగాణ ప్రజలకు నిజమైన పక్షంగా నిలబడిందని అన్నారు. తాము చేస్తోన్న దీక్షల వల్లే పాలక పక్షానికి బుద్ధి వచ్చిందన్నారు. పార్టీ పెట్టకముందే నిరాహార దీక్ష చేశానని చెప్పిన షర్మిల.. ప్రతీ మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్ష చేస్తూనే ఉంటానన్నారు. ఇప్పటివరకూ 1500 కిలోమీటర్లు…