Off The Record: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైసీపీలో రేగుతున్న అగ్గిని చల్లార్చేందుకు అధిష్టానం ఎంత ప్రయత్నిస్తున్నా… కొలిక్కి వచ్చే సూచనలు కనిపించడం లేదు. తగ్గినట్టే తగ్గి తిరిగి అంటుకుంటూ ఉండటం సమస్యను మరింత పెంచుతోందట. సాధారణంగా సౌమ్యంగా కనిపించే మాజీ ఎంపీ బుట్టా రేణుక ఎమ్మిగనూరు విషయంలో మాత్రం తగ్గేదేలే అంటున్నారట. అసెంబ్లీ నియోజకవర్గాన్ని వదిలే ప్రసక్తే లేదని పట్టుబట్టినట్టు సమాచారం. తనను ఎమ్మిగనూరు వైసీపీ ఇన్ఛార్జ్‌గా తప్పించి కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్‌గా నియమించినా……