కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మేనల్లుడు పవీష్ తన రెండో సినిమాను తాజాగా ప్రారంభించారు. ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ (తమిళ డబ్బింగ్) చిత్రంతో హీరోగా పరిచయమైన పవీష్, ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. ఈ చిత్రంలో పవీష్ సరసన కథానాయికగా తెలుగు యూట్యూబ్ ఫోక్ సెన్సేషన్ నాగదుర్గ నటిస్తుండటం విశేషం. తన జానపద పాటల ద్వారా యూట్యూబ్‌లో విశేష ప్రజాదరణ పొందిన నాగదుర్గ, ఈ…