Nimmala Ramanaidu: సందర్భం ఏదైనా తెలుగు దేశం పార్టీపై .. పసుపు రంగుపై ఆయనకి ఉన్న అభిమానాన్ని, ఆప్యాయతని వదిలిపెట్టని నాయకుడిగా మారిపోయారు మంత్రి నిమ్మల రామానాయుడు. పార్టీ కార్యక్రమమైన, అసెంబ్లీ సమావేశాలైన నిత్యం పసుపు చొక్కాతో కనిపించే మంత్రి నిమ్మల రామానాయుడు తన కూతురి వివాహ వేడుకలోనూ పసుపు చొక్కాని వదిలిపెట్టలేదు. పాలకొల్లులో ఈరోజు జరిగిన నిమ్మల రామానాయుడు కుమార్తె శ్రీజ వివాహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో పాటు ఎంపీలు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న…