ఏపీలో తుపాను ప్రభావం వల్ల శ్రీకాకుళం, విజయనగరం,విశాఖపట్నం జిల్లాలకు ఆరంజ్ అలర్ట్ జారీచేసింది వాతావరణ శాఖ. తూర్పుగోదావరి జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీచేసింది. నిన్న మధ్య అండమాన్ సముద్రం ఆనుకొని ఉన్న పరిసర ప్రాంతాల మీద ఉన్న అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశలో ప్రయాణించి ఆగ్నేయ బంగాళాఖాతం మరియు అండమాన్ సముద్ర ప్రాంతంలో ఈరోజు ఉదయం తీవ్ర అల్పపీడనంగా ఏర్పడింది. ఇది పశ్చిమ వాయువ్య దిశలో ప్రయాణించి రాగల 12గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతం వాయుగుండముగా…