'క్రానిక్ అబ్జెక్టివ్ పల్మొనరీ డిసీజ్' (సిఓపిడి) అనేది తీవ్రమైన ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధి. ఈ సమస్య ఉన్నవారిలో ఊపిరితిత్తుల నుంచి గాలి గుండెకు చేరటానికి అవరోధం కలగటంనుంచి ఊపిరితిత్తులలో ఉండే సన్నపాటి వాయుగోళాలు నశించిపోవటం లేదా దెబ్బతినటం, రక్తనాళాలు దెబ్బతినటం వంటి అనేక ఇబ్బందులు ఇమిడి ఉండవచ్చు. కాలక్రమేణా ఊపిరితిత్తులు పాడయినకొద్దీ, గాలి పీల్చుకోవటం బహుకష్టమవుతుంది.