బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెంలో యువతి హత్యకు గురైన ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ఘటనలో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో పోలీసులు కేసును ప్రతిష్టాత్మకంగ తీసుకున్నారు. ఐదు ప్రత్యేక బృందాలతో నిందితుడు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 48 గంటల్లో కేసును ఛేదించేందుకు కసరత్తు చేస్తున్నారు.హోంమంత్రి వంగలపూడి అనిత సంఘటనా స్థలాని పరిశీలించారు. బాధిత కుటుంబాన్ని కలిసి ప్రభుత్వం అండగా ఉంటుంది అని హామీ ఇచ్చారు…
తూ.గో జిల్లాలో బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలుశిక్ష విధించింది. రంపచోడవరానికి చెందిన మద్దికొండ సుధాకర్ అదే గ్రామానికి చెందిన బాలికని పలు మార్లు బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. పెళ్లి చేసుకుంటా అన్ని చేపి బలవంతంగా విశాఖ తీసుకువెళ్లాడు. దీనితో బాలిక తల్లితండ్రుల ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. పోలీసులు పోక్సో, అత్యాచారం, బెదిరింపుల కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో 20 ఏళ్లు జైలు శిక్ష…
హోం మంత్రి అనిత రాష్ట్రంలో డ్రగ్ వినియోగం, మహిళలపై అత్యాచారాలు పెరుగుతోందని, ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల రక్షణ విషయంలో ప్రణాళికగ వేవహరిస్తాం అన్ని తెలిపారు . డ్రగ్ సంబంధిత కేసులపై సమీక్ష జరుపుతామని పోలీసులతో తీసుకోవాల్సిన చెరియలపై కసరత్తు చేస్తాం అన్నారు . కోనసింహ జిల్లా అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని, మంచి ఫలితాల కోసం ఆశీస్సులు పొందారు. డ్రగ్ దుర్వినియోగ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం పోలీసులతో కలిసి పనిచేస్తుందని ఆమె భరోసా ఇచ్చారు.