Women’s Safety Awareness program in AP: మహిళల భద్రతకు సంబంధించిన అంశాలను, చట్టాల సమాచారాన్ని పాఠ్య ప్రణాళికలో చేర్చాలని, ప్రతివారం విద్యార్థినిలకు వీటిపై తరగతులు నిర్వహించాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ సహకారంతో రాజమండ్రిలో జరిగిన మహిళల సంక్షేమం, భద్రత, హక్కులపై జిల్లాస్థాయి అవగాహన కార్యక్రమానికి డాక్టర్ శైలజ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.…