Smriti Mandhana: భారత మహిళల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధానా మరోసారి చరిత్ర సృష్టించింది. స్మృతి 2019 తర్వాత తొలిసారిగా ICC మహిళల వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో నెంబర్ 1 స్థానం దక్కించుకుంది. తాజాగా ఐసీసీ విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్ లో మంధానాకు 727 రేటింగ్ పాయింట్లు లభించాయి. ఆ తర్వాత స్థానాల్లో ఇంగ్లండ్ కెప్టెన్ నాటాలీ స్కివర్ బ్రంట్ (719), దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వుల్వార్ట్ (719) లు ఉన్నారు.…